భలే జరిగింది, గొడుగు కింద పెళ్లి .. వర్షపు చినుకులే అక్షింతలయ్యాయిగా..

by samatah |   ( Updated:2023-05-01 16:14:08.0  )
భలే జరిగింది, గొడుగు కింద పెళ్లి .. వర్షపు చినుకులే అక్షింతలయ్యాయిగా..
X

దిశ, వెబ్‌డెస్క్ : పెళ్లి రెండు అక్షరాలే అయినా రెండు మనుసుల నిండు నూరేళ్ల జీవితం ముడి పడి ఉంటుంది. ఇక ఎక్కడైనా పెళ్లి బంధు మిత్రుల మధ్య అక్షంతలతో జరుగుతుంది. కానీ ఛత్తీస్ ఘడ్‌లో మాత్రం భారీ వరదలో, వర్షం చినుకుల మధ్య గొడుగు కింద పెళ్లి జరిగింది. ఇక ఈ పెళ్లిని చూసిన వారందరూ చప్పట్లు, కేరింతలతో ఆనందం వ్యక్తం చేశారు.

అసలు విషయంలోకి వెళ్లితే.. చత్తీస్‌ఘడ్‌లోని కొన్ని జిల్లాలలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ ప్రాతంలో పెళ్లి వేడుక జరిగింది. అయితే భారీ వర్షం పడటంతో, బంధువులందరూ ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. పెళ్లి మండపం వదిలి, ఇంట్లోకి వెళ్లిపోయారు. పెళ్లి మండపంలో మొత్తం నీళ్లు నిలిచాయి. దీంతో చేసేది ఏమి లేక పూజారి కూడా, ఇంట్లోకి వెళ్లిపోయాడు. ఇక పెళ్లి పందిట్లో వరుడు, వధువు ఇద్దరే మిగిలి పోయారు. పూజరి ఇంట్లో నుంచి మంత్రాలు చదువుతుంటే, పందిట్లో వర్షం చినుకుల మధ్య, గొడగు కింద వధూ వరులు మూడుముళ్లతో ఒకటయ్యారు. ప్రస్తుతం ఈ న్యూస్ తెగ వైరల్ అవుతుంది.

ఇవి కూడా చదవండి:

సెక్స్ తర్వాత యూరిన్ చేస్తే గర్భం రాదు?

Advertisement

Next Story

Most Viewed