కార్బన్ డై యాక్సైడ్‌ను సముద్రంలో నిల్వచేయొచ్చు.. ఎలాగంటే..

by Hamsa |   ( Updated:2023-03-09 09:12:53.0  )
కార్బన్ డై యాక్సైడ్‌ను సముద్రంలో నిల్వచేయొచ్చు.. ఎలాగంటే..
X

దిశ, ఫీచర్స్: పరిశ్రమలు, వాహనాల నుంచి వెలువడే కార్బన్ డై యాక్సైడ్ కారణంగా వాతావరణం కలుషితం అవుతోంది. అందుకే కర్మాగారాల నుంచి వెలువడే కార్బన్‌ను డైరెక్ట్ క్యాప్చర్ చేయాలని, డైరెక్ట్ ఎయిర్ క్యాప్చర్ (DAC) పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు రావాలని పరిశోధకులు అధ్యయనాలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా ‘సోర్బెంట్’ అనే పదార్థాన్ని గుర్తించారు శాస్త్రవేత్తలు. పెన్సిల్వేనియా బెత్లెహెమ్‌లోని లేహై విశ్వవిద్యాలయానికి చెందిన అరుప్ సేన్‌గుప్తా అండ్ టీమ్ ఈ కొత్త శోషక పదార్థాన్ని డెవలప్ చేయగా.. ఇది ప్రస్తుత పదార్థాల కంటే గాలి నుంచి ఎక్కువ CO2ని సంగ్రహించగలదు. ఇప్పటికే ఉన్న అమైన్ ద్రావకాలను కాపర్ సొల్యూషన్‌తో సవరించడం ద్వారా కార్బన్ క్యాప్చర్ సామర్థ్యాన్ని రెండు నుంచి మూడు రెట్లు పెంచారు.

కొత్త మెటీరియల్ వాతావరణ మార్పులను తగ్గించడానికి సమర్థవంతమైన, వాణిజ్యపరంగా లాభదాయకమైన సాంకేతికతగా, DAC సామర్థ్యాన్ని సమూలంగా పెంచేదిగా సేన్‌గుప్తా వివరించారు. ప్రత్యేకించి సోర్బెంట్‌ను ఉత్పత్తి చేయడానికి అవసరమైన పదార్థాలు తక్కువ ధరకు అందుబాటులో ఉంటాయి. ఇక గాలి నుంచి సంగ్రహించబడిన CO2, సముద్రపు నీటిని కలిపి సోడియం బైకార్బోనేట్ లేదా బేకింగ్ సోడాగా మార్చవచ్చు. ఇది సముద్రంలో సురక్షితంగా నిల్వ చేయబడుతుంది.

బేకింగ్ సోడాను సముద్రంలో విడుదల చేయడం వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని జరగదు. సోడియం బైకార్బోనేట్ ఒక క్షారం. కాబట్టి ఇది CO2 కరిగినప్పుడు సంభవించే సముద్రపు ఆమ్లీకరణను తిప్పికొట్టడం ద్వారా కొంత ప్రయోజనాన్ని అందించగలదు. అధిక ఆల్కలీనిటీ అంటే మరింత జీవసంబంధమైన చర్య.. అంటే మరింత CO2 సీక్వెస్ట్రేషన్(కార్బన్ డై యాక్సైడ్‌ను వాతావరణం నుంచి తొలగించే చర్య).

కాగా అంతర్జాతీయ శక్తి ఏజెన్సీ ప్రకారం, గ్లోబల్ వార్మింగ్‌ను 1.5°Cకి పరిమితం చేయడానికి కార్బన్ రిమూవల్ టెక్నాలజీల వినియోగాన్ని వేగంగా పెంచాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం సంవత్సరానికి దాదాపు 0.01మెగాటన్నుల CO2ని సంగ్రహిస్తుండగా.. 2030 నాటికి దాదాపు 60Mtకి చేరుకుంటుంది.

Read more:

ఉమెన్స్ డే రోజే దారుణం.. నగ్నంగా విషెస్ చెప్పిన నటి

శృంగారాన్ని మహిళలు ఎలా ఆస్వాదించాలి..

Advertisement

Next Story

Most Viewed