స్ట్రెస్‌ని తగ్గించుకోవాలనుకుంటున్నారా..? అయితే వీటిని తినండి!

by Kanadam.Hamsa lekha |   ( Updated:2024-11-17 07:12:57.0  )
స్ట్రెస్‌ని తగ్గించుకోవాలనుకుంటున్నారా..? అయితే వీటిని తినండి!
X

దిశ, ఫీచర్స్: ఈ ఆధునిక యుగంలో ప్రతీ ఒక్కరూ ఒత్తిడికి గురవుతున్నారు. మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఒత్తిడి లేకుండా ప్రశాంతమైన జీవనం గడపాలి. ఈ ఉరుకులు పరుగుల జీవింతలో సరైన ఆహారం, వ్యాయామం వంటివి చేయకపోవడం వల్ల ప్రతి ఒక్కరూ ఒత్తిడి, డిప్రెషన్‌కు గురవుతున్నారు. ఈ సమస్య కామ్‌గా అనిపించవచ్చు. కానీ, ఈ మానసిక సమస్యలే రోజులు పెరుగుతున్న కొద్ది శారీరక సమస్యలకు కారణం అవుతాయి. దీనిని నిర్లక్ష్యం చేస్తే రిస్క్‌లో పడతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మితిమీరిన ఒత్తిడి కారణంగా బీపీ, షుగర్, గుండె జబ్బులు వంటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణలు చెబుతున్నారు. అయితే, మనం తీసుకునే ఆహారాలు కొన్ని మానసిక ఒత్తిడిని తగ్గించి ఆరోగ్యాన్ని మెరుచుపర్చడానికి సహాయపడుతుంది. అవి ఎలాంటి ఆహారాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఒత్తిడిని తగ్గించే ఆహారాలు:

చేపలు: సాల్మన్, మాకేరెల్, సార్డినెస్ వంటి కొవ్వు చేపలు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఈ చేపల్లో ఒమేగా-3 ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఒత్తిడిని తగ్గించి, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

ఆకు కూరలు: స్ట్రెస్‌ను తగ్గించి, శారీరకంగా ఆరోగ్యంగా ఉండడానికి ఆకు కూరలు సహాయపడతాయి. వీటిలో ఉండే మెగ్నీషియం ఆరోగ్యానికి ఎంతగానే ఉపయోగపడుతుంది. అంతేకాకుండా భావోద్వేగాలకు కారణమయ్యే మెదడులోని న్యూరోట్రాన్స్మిటర్లను నియంత్రిస్తుంది.

బ్లూబెర్రీస్: బ్లూబెర్రీలు అద్భుతమైన ఆహారం. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి, మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. వీటిని స్మూతీలు, ఓట్స్ వంటి వాటిలో తింటే మంచిది. ఇవి మాత్రమే కాకుండా స్ట్రాబెర్రీ, బ్లాక్ బెర్రీ వంటి రకరకాల బెర్రీలు తినడం వల్ల శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు ఉపయోగపడతాయి. ఇవి శరీరంలోని ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది.

దానిమ్మ: ఒత్తిడిగా అనిపించినప్పుడు ఆక్సీకరణ తక్కువగా ఉంటుంది. అలా జరగకుండా ఉండేందుకు దానిమ్మ శక్తిని ఇస్తుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. దీన్ని పెరుగు, సలాడ్‌‌లో కలుపుకుని తింటే మంచిది.

బీట్రూట్: బీట్రూట్‌లోని నైట్రిక్ ఆక్సైడ్ అధికంగా ఉంటుంది. ఇది రక్తప్రసరణను మెరుగుపరిచి, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. బీట్రూట్‌ను తరుచుగా ఆహారంలో భాగంగా తినడం వల్ల ఒత్తిడిని నియంత్రిస్తుంది.

*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story