- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కనుబొమ్మలు ఒత్తుగా ఉండాలనుకుంటున్నారా? అయితే ఈ చిట్కాలు పాటించండి!
దిశ, వెబ్‌డెస్క్: అమ్మాయిలు ఎక్కువ మంది అందంపై దృష్టి పెడతారు. అందుకు పలు రకాల చిట్కాలను ఫాలో అవుతూ ఉంటారు. అయితే ఇందులో కనుబొమ్మల సమస్య ఒకటి. కొంతమంది అమ్మాయిలకు కనుబొమ్మలు పలుచగా ఉంటే, మరికొంతమందికి ఒత్తుగా ఉంటాయి. మందంగా ఉంటే బ్యూటీఫుల్‌గా కనిపిస్తారని ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అయితే సరియైన చిట్కాలేంటో నిపుణులు చెబుతున్నారు. ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందాం..
ఆముదం ఆయిల్
* ఆముదం నూనెలో హెయిర్ గ్రోత్ అయ్యే కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. జనరల్ ఆఫ్ కాస్మెటిక్ సైన్స్‌లో ప్రచురించిన ఒక అధ్యయనంలో ఆముదం ఆయిల్‌లో రిసినోలెయిక్ ఆమ్లం ఉందని కనుగొన్నది.
* ఇది ప్రోస్టాగ్లాండిన్ ఇ 2 ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. దీంతో జుట్టు వేగంగా పెరగడానికీ అవకాశం ఉంటుంది.
*ఈ నూనెను రాత్రి పడుకునే ముందు అప్లై చేసుకొని మార్నింగ్ కడుక్కోవాలి.
* దీంతో మీ కనుబొమ్మలు ఒత్తుగా తయారవుతాయి.
కలబంద...
* కలబంద చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా కనుబొమ్మలు పెరిగేందుకు గానూ ఎంతో మేలు చేస్తుంది.
* తాజా కలబంద ఆకు నుంచి జెల్ తీసి మీ ఐబ్రోస్‌కు పెట్టి.. ఒక 20 నిమిషాల పాటు అలాగే ఉంచి, తనంతరం గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి.
* ఇలా రెండు రోజులకు ఒకసారి చేయడం వల్ల కనుబొమ్మలు మందంగా అయ్యే అవకాశం ఉంటుంది.
కొబ్బరి నూనె...
* కొబ్బరి ఆయిల్ ఐబ్రోస్‌ను తేమగా ఉంచడానికి ఎంతో సహాయపడతాయి.
* ఈ నూనెలో హెయిర్ గ్రోత్‌కు మేలు చేసే విటమిన్లు, పోషకాలు ఎంతగానో ఉంటాయి.
* పలుచని కనుబొమ్మలు ఉన్నవారు పడుకునే ముందు.. కొబ్బరి నూనెను అప్లై చేస్తే చాలు.
ఉల్లిపాయ రసం
* ఉల్లిపాయ రసం కూడా కనుబొమ్మలకు పెట్టడం వల్ల హెయిర్ పెరుగుతుంది.
* ఉల్లిపాయ రసాన్ని మెత్తని బాల్స్‌తో కనుబొమ్మలకు అప్లై చేసి 20నిమిషాలు ఉంచి, కడగండి.
మెంతులు...
* మెంతుల్లో ప్రోటీన్, నికోటినిక్ ఆమ్లం పుష్కలంగా ఉంటాయి. ఇవి హైబ్రోస్ పెరిగేందుకు ఎంతగానో ప్రోత్సహిస్తాయి.
*ఇందుకోసం ఒక టేబుల్ స్పూన్ మెంతులను నైట్ నీటిలో నానబెట్టి, ఆ గింజలను మార్నింగ్ పేస్ట్‌లా గ్రైండ్ చేసి కనుబొమ్మలకు పెట్టండి.
* దీన్ని ఒక 30 నిమిషాలు అలాగే ఉంచి గోరువెచ్చని నీటితో కడగండి.
- Tags
- bolder brows
- tips