viral: ఆన్‌లైన్‌లో ఎయిర్ ఫ్రయ్యర్ ఆర్డర్ చేసిన మహిళ.. తెరిచి చూడగా..

by Javid Pasha |
viral: ఆన్‌లైన్‌లో ఎయిర్ ఫ్రయ్యర్ ఆర్డర్ చేసిన మహిళ.. తెరిచి చూడగా..
X

దిశ, ఫీచర్స్ : బయటకు వెళ్లాల్సిన పనిలేదు.. గంటల తరబడి జర్నీ చేస్తూ ట్రాఫిక్‌లో ఇబ్బంది పడాల్సిన అవసరం అంతకంటే లేదు.. జస్ట్‌ వన్ క్లిక్ చాలు. నచ్చిన ఐటమ్ ఇంటివద్దకే వచ్చే సౌకర్యం ఉన్నందున ఈ మధ్య చాలామంది ఆన్‌లైన్ షాపింగ్‌ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇష్టమైన వస్తువులను ఆర్డర్ చేసి తెప్పించుకుంటున్నారు. ఇటీవల ఓ మహిళ కూడా అదే చేసింది. కానీ పార్సిల్ వచ్చాక తెరిచి చూసి ఒక్కసారిగా షాకైంది. ఏం జరిగిందంటే..

కొలంబియాకు చెందిన సోఫియా సెరానో అనే మహిళ ఇటీవల తన ఇంటి అవసరాలకోసం ఓ ఎయిర్ ఫ్రయ్యర్‌ను ఆన్‌లైన్ షాపింగ్ సైట్‌లో ఆర్డర్ చేసింది. రెండు మూడు రోజుల తర్వాత డెలివరీ బాయ్ దానికి సంబంధించిన పార్సిల్‌ను తీసుకొచ్చాడు. సదరు మహిళకు ఇచ్చి అతను వెళ్లిపోయాడు. కాగా తర్వాత దానిని ఓపెన్ చేసిన సోఫియా.. అందులో కనిపించిన దృశ్యాన్ని చూసి ఒక్క సారిగా షాక్‌కు గురైంది. ఎందుకంటే అందులో ఉన్నది ఎయిర్ ఫ్రయ్యర్ కాదు.. బల్లి. అయితే అది స్పానిష్ రాక్ బల్లిగా గుర్తించానని పేర్కొన్న సోఫియా తన అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకోగా ప్రస్తుతం ఈ వార్త వైరల్‌గా మారింది.



Next Story