Viral Video : ఇదేం వింత ఫ్యాషన్ తల్లీ.. ‘చేపల డ్రెస్సు’లో రోడ్డుపై క్యాట్ వాక్ చేస్తూ..

by Javid Pasha |
Viral Video : ఇదేం వింత ఫ్యాషన్ తల్లీ.. ‘చేపల డ్రెస్సు’లో రోడ్డుపై క్యాట్ వాక్ చేస్తూ..
X

దిశ, ఫీచర్స్ : ఫ్యాషన్ షో అంటే.. ఎవరికైనా వెంటనే గుర్తుకు వచ్చేది రంగు రంగుల డ్రెస్సులతో, వెరైటీ యాక్సెసరీస్‌తో ర్యాంప్‌పై క్యాట్‌వాక్ చేసే మోడల్స్. ఇంకొంచెం వెరైటీగా అంటే.. స్కర్టులు, హాఫ్ పీస్ బికినీలు ధరించిన అందాల తారల సందడి. కానీ ఇందుకు భిన్నంగా వింత గొలిపే వెరైటీ ఫ్యాషన్ అండ్ క్యాట్ వాక్‌కు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తోంది. సాధారణంగా అందమైన దుస్తుల్లో, ఫ్యాషన్ వస్తువుల్లో మోడల్స్ కనిపిస్తారు. కానీ ఈ వీడియోలో కనిపిస్తు్న్న యువతి మాత్రం చేపలనే శరీరానికి వస్త్రంలా చుట్టేసుకొని రోడ్డుపై ఫ్యాషన్ షోలో మాదిరి క్యాట్ వాక్ చేసింది.

వైరల్ వీడియో ప్రకారం.. ఓ యువతి కొన్ని చేపలను తన శరీరంపై డ్రెస్సు మాదిరి కవర్ చేస్తూ రోడ్డుపై క్యాట్ వాక్ చేస్తోంది. ఈ ఫన్నీ వీడియోను @gofishingindonesia అనే ఇన్‌స్టా గ్రామ్ వేదికగా పోస్ట్ చేయగా తెగ వైరల్ అవుతోంది. అందులోని యువతి ధరించిన ఫిష్ డ్రెస్ చాలా విచిత్రంగా ఉందంటూ పలువురు పేర్కొంటున్నారు. ఆమె చేపలను డ్రెస్ మాదిరి ధరించడంతోపాటు చేతిలో పట్టుకొన్న పర్సు కూడా ఓ పెద్ద చేపయే కావడం మరీ విచిత్రం. అలా చేపల డ్రెస్సుతో, చేతిలో పెద్దచేప పర్సుతో ఉత్సాహంగా రోడ్డుపై యువతి క్యాట్ వాక్ చేస్తుంటే.. అందరూ ఆమెను చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇదో వింత ఫ్యాషన్ అంటూ పలువురు నెటిజన్లు క్యూరియాసిటీతో రకరకాలుగా స్పందిస్తున్నారు.

Video Credits to @gofishingindonesia Insta Id

Advertisement

Next Story

Most Viewed