viral : కెమెరా పట్టుకొని గుహలోకి వెళ్లారు.. అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా..

by Javid Pasha |   ( Updated:2024-07-12 07:49:19.0  )
viral : కెమెరా పట్టుకొని గుహలోకి వెళ్లారు.. అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా..
X

దిశ, ఫీచర్స్ : పర్వత లోయలు, కొండ గుహలు అంటేనే కొందరిలో క్యూరియాసిటీ పెరుగుతుంది. చూడాలన్న ఆసక్తి ఉన్నా వాటి లోతు, చిమ్మ చీకటితో కూడిన లోపలి భాగం, భయానక పరిసరాల కారణంగా సాధారణ ప్రజలైతే వెనుకడుగు వేస్తుంటారు. కానీ పరిశోధకులు, సాహసికులు, శిక్షణ పొందిన ట్రెక్కర్స్ మాత్రం అక్కడేముందో తెలుసుకోవడానికి ధైర్యంగా ముందుకు వెళ్తుంటారు. ఇటీవల కొందరు కేవ్ ఎక్స్‌ప్లోర్ టీమ్ నిపుణులు కూడా అదే చేస్తున్నారు. గుహల సందర్శన, అనుభవాలకు సంబంధించిన వీడియోలను, సమాచారాన్ని వారు ‘యాక్షన్ అడ్వెంచర్ ట్విన్స్’ అనే ఓ ట్యూబ్ ఛానల్ ద్వారా పంచుకుంటున్నారు. ప్రజెంట్ అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఎక్స్‌ప్లోర్ టీమ్ నిపుణులు గుహల అన్వేషణలో భాగంగా అమెరికా దేశంలో, జార్జియాలోని కౌంటీలో గల అత్యంత లోతైన గుహలో ఒకటిగా పేర్కొనే 586 అడుగుల లోతైన ఎల్లీప్సన్ గుహలో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా వారు ఒక ఎలక్ట్రికల్ డ్రిల్‌కు కట్టిన పొడవైన తాడు ద్వారా గుహలోకి దిగుతారు. అయితే తమకంటే ముందే గోప్రో కెమెరాను గుహ లోపికి డ్రాప్ చేస్తుంటారు. అయితే ఈ సందర్భంగా కెమెరాలో రికార్డయిన దృశ్యాలను వారు సోషల్ మీడియాలో పంచుకోగా అది చూసిన వారు మాత్రం వణికిపోతున్నారు. ఎందుకంటే అందులో ఓ భయంకరమైన చీకటితో నిండిన అగాధం, ఏవో వెంటాడుతున్న నీడలు కనిపించాయని, మొదట్లో భయానక దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా భయం వేసిందని అన్వేషకుల్లో ఒకరు పేర్కొన్నారు.

అసలే కొండ గుహల గురించి అనేక ఘోస్ట్ స్టోరీలు, వింత సంఘటనలు, భయంకర దృశ్యాలు వంటివి తరచుగా ప్రచారంలో ఉంటున్నాయి. దీంతో అక్కడ దెయ్యాలు ఉంటాయని కూడా కొందరు అపోహ పడుతుంటారు. ప్రస్తుతం కేవ్ ఎక్స్‌ప్లోర్ టీమ్ నిపుణులు షేర్ చేసిన వీడియోను చూసినవారిలో కూడా పలువురు అదే అనుకుంటున్నారు. అక్కడ అతీత శక్తులేవో తిరుగుతున్నాయని, అన్వేషకులను వెంటాడుతున్నాయని అభిప్రాయపడుతున్నారు. చిమ్మ చీకటిలో ఏదో భయంకరమైన వస్తువు దాగి ఉన్నట్లు కనిపిస్తోందని, నిలబడి ఉన్న వ్యక్తి బ్యాగ్రౌండ్‌లో దెయ్యం ఉందని కామెంట్లు పెడుతున్నారు. కానీ క్లేవ్ ఎక్స్‌ప్లోర్ నిపుణులు మాత్రం దెయ్యాలు, భూతాలు ఏవీ లేవని, అది గుహల్లో ఉండే సహజ వాతావరణమేనని పేర్కొంటున్నారు. ప్రజెంట్ ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Advertisement

Next Story

Most Viewed