వినాయక చవితి స్పెషల్..ఆ పూలకు భారీగా పెరిగిన డిమాండ్

by Jakkula Mamatha |   ( Updated:2024-09-06 13:02:07.0  )
వినాయక చవితి స్పెషల్..ఆ పూలకు భారీగా పెరిగిన డిమాండ్
X

దిశ,వెబ్‌డెస్క్:వినాయక చవితి సందర్భంగా ప్రజెంట్ ఎక్కడ చూసినా పండుగ వాతావరణం నెలకొంది. నగరాల్లోనే కాకుండా పల్లె ప్రాంతాల్లో కూడా ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఎక్కడ చూసిన మండపాలతో పల్లెలు ముస్తాబు అవుతాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఈ గణపతి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొంటారు. అయితే ప్రస్తుతం ఎటు చూసిన వినాయక చవితి పర్వదినం సందర్భంగా మండపాలను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే పలు చోట్ల గణేశుని విగ్రహాలు కొనుగోలు చేసిన కమిటీ సభ్యులు వాటిని మండపాలకు తరలించే పనుల్లో నిమగ్నమయ్యారు. వినాయక చవితి రాక ముందే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా పండుగ శోభ సంతరించుకుంటుందనే విషయం తెలిసిందే. ఎందుకంటే వినాయక మండపాలను కనీసం 15 రోజుల ముందు నుంచే ప్రిపేర్ చేయడం జరుగుతుంది.

వినాయక చవితి పండుగ నేపథ్యంలో మార్కెట్లో వ్యాపారాలు స్పీడ్ అందుకున్నాయి. ఇదే సమయంలో పూజల కోసం ఉపయోగించే పూల అమ్మకాలు కూడా జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో గుడి మల్కాపూర్ మార్కెట్‌కి చవితి కళ వచ్చింది. సిటీతో పాటు శివారు ప్రాంతాలు, ఇరుగు పొరుగు జిల్లాల నుంచి కొనుగోలుదారులు తరలి వస్తున్నారు. బంతి, చామంతి, గులాబీ వంటి పూలు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. ప్రతిరోజు గుడిమల్కాపూర్‌కు 10 నుంచి 12 టన్నుల దాకా బంతిపూలు వస్తుండగా ఈ రెండు రోజుల్లో సుమారు 25 టన్నులు వచ్చినట్టు వ్యాపారులు తెలిపారు. రెగ్యులర్‌గా చామంతి పూలు 2 నుంచి 3 టన్నుల వరకు వచ్చేవని, ఈ మూడు రోజుల్లో దాదాపు 7 టన్నుల దాకా అమ్మినట్లు తెలిపారు. మేలి రకం బంతిపూలు కొలోకి రూ.100, రెండో రకం రూ.80 నుంచి రూ.60దాకా అమ్ముతున్నారు. చామంతి కేజీ రూ.250 వరకు విక్రయిస్తున్నారు. దీంతో వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed