నాగుపాముకు ఆపరేషన్ చేసిన పశువైద్యులు.. 15 రోజులు బెడ్ పైనే..!

by Dishaweb |   ( Updated:2023-06-23 09:40:57.0  )
నాగుపాముకు ఆపరేషన్ చేసిన పశువైద్యులు.. 15 రోజులు బెడ్ పైనే..!
X

దిశ,వెబ్‌డెస్క్ : ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లు మూగ జీవులకు, మానవాళికి ప్రమాదకరంగా మారుతున్నాయని ఎంత.. చెప్పిన ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని ఎంత చెప్పినా ఏమాత్రం స్పందించడం లేదు. ఈ నేపథ్యంలో మానవుల స్వార్థానికి ప్రకృతి, వన్య ప్రాణులు ఏ విధంగా సమస్యలు ఎదుర్కొంటున్నాయో చెప్పేందుకు ఈ సంఘటనే నిదర్శనం. సహజంగా పాములు చిన్న చిన్న కీటకాలను, జీవులను తింటూ వాటి జీవనం కొనసాగిస్తాయి. కానీ ఓ నాగుపాము ఆహారం తీసుకునే క్రమంలో ప్లాస్టిక్ డబ్బాను అమాంతం మింగేసింది. కర్ణాటకలోని మంగళూరులోని సాలుమరాడ ప్రాంతంలోని తిమ్మక్క పార్కు సమీపంలో ఇది జరిగింది. తీవ్రగాయాలతో అవస్థపడుతున్న పామును చూసి స్థానికులు పశువైద్యులకు సమాచారం ఇచ్చారు. వెంటనే వారు దానికి ఆపరేషన్ చేసి ప్లాస్టిక్ డబ్బాను బయటకు తీశారు. అనంతరం 15 రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. అది కోలుకున్న తర్వాత ఫారెస్ట్ అధికారుల సూచన మేరకు అటవీ ప్రాంతంలో విడిచిపెట్టినట్లు డాక్టర్ యశస్వి తెలిపారు.

Read More... ఎముకలు సమస్య ఉన్న వారు.. ఈ జ్యూస్ తాగితే చాలు!

Advertisement

Next Story

Most Viewed