Vegan diet : వీగన్ డైట్.. ఈ ఆహారపు అలవాట్లతో లాభమా.. నష్టమా?

by Javid Pasha |
Vegan diet : వీగన్ డైట్.. ఈ ఆహారపు అలవాట్లతో లాభమా.. నష్టమా?
X

దిశ, ఫీచర్స్ : వీగన్ డైట్.. ఈ మధ్య తరచుగా వినిపిస్తున్న పదం ఇది. పలువురు సెలబ్రిటీలు కూడా తమ అందం, ఆరోగ్యం, ఫిట్‌నెస్ కాపాడుకోవడానికి ఈ ఆహార నియమాలను పాటిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతుంటాయి. దీంతో పలువురు యువతీ యువకులు కూడా దీనిపై మొగ్గు చూపుతున్నారు. ఇంతకీ వీగన్ డైట్ వల్ల ఆరోగ్యానికి కలిగే లాభ నష్టాలేమిటో చూద్దాం.

మనం ఆరోగ్యంగా ఉండటంలో ప్రధానపాత్ర పోషించేది ఆహారాలే. సింపుల్‌గా చెప్పాలంటే కేవలం శాఖాహారాన్ని మాత్రమే తీసుకోవడాన్ని వీగన్ డైట్ అంటారు. మొక్కలు, వృక్ష సంబంధిత ఉత్పత్తులకు ఇక్కడ ప్రాధాన్యం ఉంటుంది. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్నప్పటికీ దీనిమూలాలు దశాబ్దాలక్రితం నాటివని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా వీగన్, వీగనిజం అనే పదాలు 1944లో పుట్టుకొచ్చాయి. ఎందుకంటే అప్పట్లో డొనాల్డ్ వాట్సన్ అనే ఒక నిపుణులు ‘ది వీగన్’ సొసైటీని ఏర్పాటు చేశాడు. ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం శాఖాహారం మాత్రమే తినాలని ప్రచారం చేశాడు.

వీగన్ డైట్ ఫాలో అయ్యేవారు జంతువుల నుంచి వచ్చే ఏ ఆహార పదార్థాలు కూడా తీసుకోరు. మాంసంతోపాటు పాలు, పెరుగు, నెయ్యి కూడా తినరు. కేవలం మొక్కలు లేదా చెట్ల ద్వారా వచ్చేవాటిని మాత్రమే తీసుకుంటారు. అయితే మాంసం, గుడ్లు, చేపలు వంటి ఆహారాలు తినరు కాబట్టి వాటి ద్వారా లభించే పోషకాలను కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇలాంటప్పుడు వీగన్లు ప్రత్యామ్నాయంగా శాఖాహారల్లోనే అన్ని రకాల లభించేలా చూసుకుంటారు. పాలకు బదులు పల్లీల నుంచి తీసిన పాలు, కొబ్బరిపాలు, జీడిపప్పుతో చేసిన ఛీజ్ కేక్ వంటివి తీసుకోవడం మాంసాహారం ద్వారా లభించే పోషకాలకు ప్రత్యామ్నాయంగా భావిస్తారు. ప్రముఖ బాలీవుడ్ నటులు అమీర్ ఖాన్, సోనమ్ కపూర్, కంగనా రనౌత్, శ్రద్ధాకపూర్, అనుష్క శర్మ వంటివారు కూడా వీగన్ డైట్ ఫాలో అవుతుంటారని చెప్తారు.

ప్రయోజనాలు

కేవలం మొక్కల ఆధారిత ఆహారాలు, పప్పు ధాన్యాలు వంటివి మాత్రమే తినడం వల్ల శరీరంలో కొవ్వు శాతం పెరగదు. పూర్తి శాఖాహారాన్ని అనుసరిస్తారు కాబట్టి రక్తంలో చక్కెరస్థాయిల నియంత్రణలో కీలకపాత్ర పోషిస్తుందని చెప్తారు. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగు పర్చడంలోనూ ఈ డైట్ ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందని నమ్ముతారు. ఫ్యాట్ కంటెంట్ లేకపోవడంవల్ల స్ట్రోక్, గుండె జబ్బులు వంటివి రాకుండా ఉంటాయని చెప్తారు.

సైడ్ ఎఫెక్ట్స్

వీగన్ డైట్ ఫాలో అయ్యేవారు చేపలు, గుడ్లు, మాంసం వంటివి తినకపోవడంవల్ల కొంత నష్టపోయే అవకాశం ఉంటుంది. కేవలం శాఖాహారం తీసుకుంటారు కాబట్టి మాంసాహారం ద్వారా లభించే ప్రోటీన్లు, కాల్షియం, విటమిన్ బి12, ఐరన్ వంటి పోషకాల లోపంతో ఇబ్బంది పడే అవకాశం లేకపోలేదు.

* గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed