వంటగదిలో స్పాంజ్ వాడుతున్నారా? అయితే జాగ్రత్త..

by Sathputhe Rajesh |
వంటగదిలో స్పాంజ్ వాడుతున్నారా? అయితే జాగ్రత్త..
X

దిశ, ఫీచర్స్:వంటగదిలో స్పాంజ్ వాడుతున్నారా? కానీ ఈ కిచెన్ క్లీనర్ సూక్ష్మజీవుల స్వర్గధామమని మీకు తెలుసా? మీరెక్కడ హాయిగా ఉండగలరని బ్యాక్టీరియాను అడిగితే... ఇంకెక్కడ వంటగదిలోని స్పాంజ్ అని పార్టీ చేసుకుంటున్నాయని విన్నారా? కానీ ఇందతా నిజమని గుర్తించారు పరిశోధకులు. స్పాంజ్‌లు ప్రతీ క్యూబిక్ సెంటిమీటర్‌కు 54 బిలియన్ బ్యాక్టీరియాలను కలిగి ఉండి.. మానవుల వ్యాధికారకంగా మారుతున్నాయని వివరించారు డ్యూక్ యూనివర్సిటీ సైటింస్టులు. కొన్ని బ్యాక్టీరియాలు తోటివారితో పరస్పర చర్యలను ఇష్టపడుతూ సామాజికంగా ఉండాలనుకుంటే.. మరికొన్ని ఏకాంతం కోరుకుంటాయని నిర్ధారించారు. అంతేకాదు స్పాంజ్ మీద ప్రొడ్యూస్ అయ్యే బ్యాక్టీరియల్ కమ్యూనిటీ... ప్రయోగశాలలో తయారయ్యే బ్యాక్టీరియా కంటే వైవిధ్యంగా ఉందన్నారు. ఇక మాంసం వండిన రోజు గిన్నెలు శుభ్రపరిచేందుకు ఉపయోగించిన స్పాంజ్‌లో బ్యాక్టీరియా లెవల్స్ ఎక్కువగా ఉన్నాయని స్పష్టం చేసిన వైద్యులు.. వంటగది పరిశుభ్రతకు స్పాంజ్ సరిపోదని తెలిపారు. ఇందుకోసం బ్రష్ ఉపయోగించడమే మంచిదని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed