- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్కడ అత్తారింటికి వెళ్లేది వరుడే.. కట్నకానుకలు కూడా ఘనంగానే..
దిశ, ఫీచర్స్ : సాధారణంగా భారతదేశం పితృస్వామ్య సమాజపు ఆచారాల ప్రకారమే నడుస్తుంది. కుటుంబాల్లో తండ్రే నిర్ణయాధికారం కలిగి ఉంటాడు. దాన్ని భార్యా పిల్లలు అనుసరించాల్సి ఉంటుంది. ఇంటిపేరు కూడా ఆయనదే ఫాలో అవుతుంటారు. అయితే మేఘాలయ వంటి ఈశాన్య ప్రాంతాల్లో నివాసం ఉండే ఖాసీ, గోరా తెగల్లో మాత్రం ఇందుకు భిన్నంగా మాతృస్వామ్య నిర్మాణం ప్రతిబింబిస్తుంది. వరుడు పెళ్లి చేసుకుని వధువు ఇంటికి వెళ్లాలి.. ఆమె వంశాన్ని భర్త, పిల్లలు ఇంటి పేరుగా స్వీకరించాలి. సినిమాల్లో మాదిరిగా కథ అల్లినట్లు ఉన్నా.. ఇది పక్కా నిజం. కాగా ఇక్కడి మాతృస్వామ్య వ్యవస్థకు సంబంధించిన మరిన్ని విశేషాలు తెలుసుకుందాం.
ఈ తెగల్లో కమ్యూనిటీ రెండు వంశాల మీద బేస్ అయి ఉంది. కుర్, ఖా అని పిలవబడుతుంది. ఒకరినొకరు తెలుసుకోవాలని, గౌరవించాలని, ఇరువైపులా సంబంధాన్ని గుర్తించాలని.. ఈ ప్రాథమిక సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరినీ ఆదేశిస్తుంది. ఇక ఈ మాతృస్వామ్య వ్యవస్థ మహిళలకు ప్రముఖ పాత్రను కల్పిస్తుంది, కుటుంబ ఆస్తులకు ఏకైక సంరక్షకులుగా ఉండటానికి, సమాజంలో నిర్ణయాత్మక నిర్ణయాధికారులుగా ఉండటానికి అనుమతిస్తుంది. పట్టణ, గ్రామీణ వర్గాలలో స్త్రీలకు ఇచ్చే గౌరవం, ప్రాముఖ్యతను పటిష్టం చేస్తూ ఆడపిల్లల పుట్టుకను ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకుంటారు. పెళ్లి తర్వాత కొడుకులు అత్తారింటికి వెళ్తుండగా.. సంపద, ఆస్తి చిన్న కుమార్తెకు బదిలీ చేయబడుతుంది.
ఇక వివాహ ఆచారాలు కూడా ప్రత్యేకమైనవే. వరుడు.. వధువుకు వివాహ వస్త్రాలు, అభరణల్లో కొంత భాగాన్ని బహుమతిగా ఇస్తాడు. వధువు బంగారం లేదా వెండితో తయారు చేసిన కిరీటాన్ని ధరిస్తుంది. దీని వెనుక ఉండే శిఖరం లాంటి చిహ్నం.. ఆమె ఉన్నత స్థితికి ప్రతీక. ఇక కున్, ఖా అనే రెండు వంశాలు ఉన్న ఈ తెగల్లో.. ఒకే తెగకు చెందిన వారు పెళ్లి చేసుకోవడం నేరం. ఒకవేళ కాదని చేసుకున్నా బహిష్కరణ తప్పదు. ఇక ప్రేమ వివాహాలు కూడా జరుగుతున్నాయి ఇక్కడ. కానీ మాతృస్వామ్య వ్యవస్థనే ఫాలో అవుతున్నాయి. కాగా పెళ్లి పెద్దలుగా తల్లి
మేనమామలు ఉంటుండగా.. సంబంధం చూసిన నుంచి మ్యారేజ్ పూర్తయ్యే వరకు ఇరువైపులా మాట్లాడేది వీరే. విడాకులు తీసుకోవాలంటే రెండు వైపులా అంగీకారం తప్పనిసరి. వివాహానికి సాక్ష్యంగా ఉన్న ప్రతినిధుల సమక్షంలోనే ఈ కార్యక్రమం జరగాలి. ఖాసీ వివాహం అనేది వంశాన్ని మరింత విస్తరించేందుకు కీలకమైనదిగా పరిగణించబడుతుంది. కాబట్టి ఒక జంటకు సంతానం లేని సందర్భాల్లో.. విడిపోవడానికి అనుమతిస్తుంది. అయితే అధికారిక విడాకులు మంజూరు చేయబడే వరకు భార్యాభర్తలిద్దరూ మళ్లీ వివాహం చేసుకోలేరు. ఈ ఆచారాలకు బలమైన కట్టుబడి ఉండటం వివాహ పవిత్రతను.. కుటుంబం, సామాజిక నిర్మాణాలను నిర్వహించడంలో మహిళలు పోషించే ముఖ్యమైన పాత్రను బలపరుస్తుంది.