- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ అడవిలో అంతుచిక్కని రహస్యాలు.. అక్కడ ఆత్మహత్యలకు దయ్యాలే కారణమా..
దిశ, ఫీచర్స్ : విశ్వవ్యాప్తంగా ఎన్నో అంతుచిక్కని రహస్య ప్రదేశాలు దాగి ఉన్నాయి. ఆ ప్రదేశాల్లో ఒక్కో దానికి ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది. అలాంటి ఒక ప్రదేశమే ఆత్మహత్యల అడవి. అదేంటి పేరు వింటే కాస్త వింతగా, ఆశ్చర్యకరంగా ఉంది కదా. ఇంతకీ ఈ విచిత్రమైన అడవి ఎక్కడ ఉంది దాని వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
జపాన్ రాజధాని టోక్యో నుండి కేవలం 2 గంటల దూరంలో ఉన్న అడవి వెలుపల ఓ సైన్ బోర్డు ఏర్పాటు చేశారు. సాధారణంగా అడవిలో ప్రమాదకరమైన జంతువుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తారు. కానీ జపాన్‌లోని అకిగహరా అనే అడవిలో మాత్రం ఆత్మహత్యలు చేసుకోవద్దని సైన్ బోర్డులు పెడుతున్నారు. ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ సూసైడ్ పాయింట్లలో ఒకటైన ఆ రహస్యమైన ప్రదేశం గురించి తెలుసుకుందాం.
అకిగహరా అడవి దాదాపు 35 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో చెట్లు విస్తరించి ఉన్నాయి. ఇది అడవి చాలా దట్టంగా ఉంటుంది. దీనిని 'చెట్ల సముద్రం' అని కూడా పిలుస్తారు. చాలా మంది ప్రజలు వాకింగ్ చేయడానికి, స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించడానికి ఇక్కడికి చేరుకుంటారు. కానీ కొందరు పర్యాటకులు మాత్రం అక్కడికి కేవలం ఆత్మహత్యలు చేసుకునేందుకు మాత్రమే వస్తారని ఆ ప్రాంత ప్రజలు చెబుతుంటారు. 2013-2015 మధ్య ఆ అడవిలో 100కు పైగా ఆత్మహత్యలు నమోదయ్యాయని చెబుతారు.
ఆత్మహత్యల అడవి..
శాన్ ఫ్రాన్సిస్కో గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ తర్వాత, ప్రపంచంలోనే అత్యధిక ఆత్మహత్య కేసులు అకిగహరా అడవుల్లో జరిగాయని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. అందుకే ఈ అడవిని 'సూసైడ్ ఫారెస్ట్' అని పిలుస్తారు. చరిత్ర పుటలను తిరగేస్తే సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం ఇక్కడ లావా ప్రవహించేదట. 864 సంవత్సరంలో జపాన్‌లోని ఫుజి పర్వతం వద్ద 6 నెలల పాటు భారీ పేలుడు సంభవించింది. ఆ సమయంలో సమీపంలోని అనేక గ్రామాలన్ని దగ్ధం అయ్యాయట. గత కొన్ని వందల సంవత్సరాలలో ఘనీభవించిన లావా స్థానంలో దట్టమైన అడవి ఏర్పడింది. ఈ అడవిని ఇప్పుడు అకిగహరా అని పిలుస్తారు.
అకిగహరా అడవుల్లోనే ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ?
1960లో ప్రసిద్ధి చెందిన 'టవర్ ఆఫ్ వేవ్స్' అనే చిన్న కథలో కూడా అకిగహరా ప్రస్తావన ఉంది. సమాజం కలవకుండా అడ్డుకున్న ప్రేమికుల జంట పై కథ దృష్టి పెట్టిందట. ఈ కథలో ప్రియురాలు అడవికి వెళ్లి తన ప్రాణాలను తీసుకుంటుంది. ప్రేమలో ఒకరి జీవితాన్ని త్యాగం చేయడం గురించి జానపద కథలు ఇప్పటికే జపాన్‌లో బాగా ప్రాచుర్యం పొందాయి. ఇలాంటి కథలు ఆ ఆలోచనను మరింత బలపరిచాయి. అయితే అకిగహరా అడవుల్లో ఆత్మహత్య చేసుకోవడానికి ఇదొక్కటే కారణం కాదు.
జీవించాలనే కోరికను కోల్పోయినప్పుడు..
2009లో అకిగహరాలో తన జీవితాన్ని ముగించుకోవడానికి ప్రయత్నించిన వ్యక్తిని CNN ఇంటర్వ్యూ చేసింది. ఆ వ్యక్తి జీవించాలనే కోరికను కోల్పోయాడట. అతడిని ఉద్యోగం నుంచి తొలగించడంతో అడవిలో ఆత్మహత్య చేసుకుని భూమ్మీద కనిపించకుండా పోవాలనుకున్నాడట. అయితే అడవికి చేరుకున్న తర్వాత వ్యక్తి తన మణికట్టును కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడట. దీంతో అతను స్ప్రుహ తప్పి పడిపోయాడట. అప్పుడే ఓ బాటసారి అతన్ని చూసి రక్షించాడని తెలిపారు.
శక్తుల ప్రభావం..
అకిగహరా అడవిలో అద్భుత శక్తులు ఉన్నాయని అక్కడి ప్రజలు పేర్కొంటారు. అడవిలో దెయ్యాలు నివసిస్తాయని అక్కడి ప్రజలు నమ్ముతారు. అక్కడికి వచ్చే ప్రజలను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపిస్తాయని చెబుతుంటారు. అకిగహరాలోని దట్టమైన అడవిలో ఎవరైనా ఒక్కసారి తప్పిపోతే, బయటకు రావడం చాలా కష్టమని కూడా చెబుతుంటారు. కంపాస్, మొబైల్ వంటి పరికరాలు కూడా ఇక్కడ పని చేయవట. చాలా మంది ప్రజలు తమ దారిని కనుగొనకముందే అడవి జంతువులకు బలైపోతుంటారని చెబుతారు.