వేర్వేరు తండ్రులకు పుట్టిన కవల పిల్లలు.. డాక్టర్లు షాక్!

by sudharani |
వేర్వేరు తండ్రులకు పుట్టిన కవల పిల్లలు.. డాక్టర్లు షాక్!
X

దిశ, ఫీచర్స్ : బ్రెజిల్‌కు చెందిన 19 ఏళ్ల యువతి ఇద్దరు వేర్వేరు తండ్రుల ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చి వైద్యులను ఆశ్చర్యపరిచింది. ఈ అరుదైన స్థితి మిలియన్‌లో ఒక్కరికే దక్కే అవకాశం ఉందని డాక్టర్లు వెల్లడించారు. విషయానికొస్తే.. గోయాస్‌లోని మినేరియోస్‌కు చెందిన అజ్ఞాత మహిళ ఒకే రోజు ఇద్దరు పురుషులతో సెక్స్‌లో పాల్గొని తొమ్మిది నెలల తర్వాత కవలలకు జన్మనిచ్చింది. అయితే ఈ ట్విన్స్‌కు తండ్రి ఎవరనే సందేహంతో ఆమె పితృత్వ పరీక్షను నిర్వహించగా ఈ విషయం వెలుగుచూసింది.

సదరు మహిళ తన పిల్లలకు ఎవరినైతే తండ్రిగా భావిస్తుందో ఆ వ్యక్తి ఒక్క శిశువుకు మాత్రమే తండ్రి అని డీఎన్‌ఏ పరీక్షలో తేలడంతో ఆశ్చర్యపోయింది. ఆశ్చర్యకరంగా ఇద్దరు వేర్వేరు పురుషుల ద్వారా గర్భం దాల్చి, ఒకే ప్రసవంలో జన్మనిచ్చిన ఆ పిల్లల్లో చాలావరకు పోలికలు ఉన్నాయని కవలల తల్లి చెప్పింది. ఈ దృగ్విషయం చాలా అరుదైనది అయినప్పటికీ పూర్తిగా అసాధ్యం కాదు. శాస్త్రీయంగా దీనిని 'హెటిరోపేరెంటల్ సూపర్‌ఫెకండేషన్' అని పిలుస్తారు. 'ఒకే తల్లి నుంచి రెండు అండాలు వేర్వేరు పురుషుల ద్వారా ఫలదీకరణం చెందినపుడు ఇది సాధ్యమే. పిల్లలు తల్లి జన్యు పదార్థాన్ని పంచుకుంటారు. కానీ అవి వేర్వేరు మావిలో పెరుగుతాయి' అని మహిళా వైద్యుడు డాక్టర్ తులియో జార్జ్ ఫ్రాంకో స్థానిక వార్తా సంస్థ గ్లోబోతో అన్నారు.

నివేదికల ప్రకారం ప్రపంచంలో కేవలం 20 ఇతర హెటిరోపేరెంటల్ సూపర్‌ఫెకండేషన్‌ కేసులు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం ఆ శిశువులకు 16 నెలల వయసుండగా.. తండ్రులలో ఒకరు వారిని జాగ్రత్తగా చూసుకుంటున్నారని యంగ్ మదర్ తెలిపింది. ఈ లెక్కన కవలల జనన ధృవీకరణ పత్రంలో ఒక్కరి పేరే జతచేస్తారని అర్థమైంది.

Advertisement

Next Story