World AIDS Day 2024: నేడే ప్రపంచ ఎయిడ్స్ డే.. హెచ్ఐవీపై ఉన్న అపోహల్లో నిజమేంటో తెలుసుకోండి!

by Kanadam.Hamsa lekha |
World AIDS Day 2024: నేడే ప్రపంచ ఎయిడ్స్ డే.. హెచ్ఐవీపై ఉన్న అపోహల్లో నిజమేంటో తెలుసుకోండి!
X

దిశ, ఫీచర్స్: నేడే ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం. హెచ్‌ఐవీ, ఎయిడ్స్ గురించి ప్రతీ ఒక్కరికీ అవగాహన కల్పించేందుకు, 1988 నుండి ప్రతీ ఏడాది డిసెంబర్ 1వ తేదీన దీనిని నిర్వహిస్తుంటారు. సమాజం, కుటుంబాలపై ఇది ఎలాంటి ప్రభావం చూపుతుంది.. హెచ్‌ఐవీ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పడం దీని ముఖ్య ఉద్దేశం. అసలు ఈ ఎయిడ్స్ ప్రభావమేంటి, ఈ వ్యాధి ఎలా వ్యాప్తిస్తుందనే దానిపై చాలామందికి రకరకాలుగా సందేహాలు ఉంటాయి. దీని గురించి నిజాలు ఏవో.. అపోహలు ఏవో ఇక్కడ తెలుసుకోండి.

ఈ ఏడాది థీమ్:

ఈ ఏడాది ఎయిడ్స్ డే కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ థీమ్‌ను ప్రకటించింది. అదే ‘సరైన దారి ఎంచుకోండి: నా ఆరోగ్యం, నా హక్కు’. ప్రపంచవ్యాప్తంగా స్థానిక ప్రభుత్వాలు, ఆరోగ్య సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ఈ రోజును గురించి ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహిస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా 2023వ సంవత్సరంలో 13 లక్షల మందికి పైగా హెచ్‌ఐవీ బారిన పడినట్లు అధ్యయనాలు తెలిపాయి. అయితే, ఒకప్పుడు ఎయిడ్స్‌ను నియంత్రించే పరిస్థితి లేదు. దానికి సరైన చిక్సిత్స కూడా లేదు. ఈ దీర్ఘకాలిక వ్యాధిని ఎలా గుర్తించాలి, రోగనిర్ధారణ, అంటు వ్యాధి సంరక్షణ వంటి అంశాలపై అవగాహనను కల్పిస్తుంటారు.

అపోహలు, నిజాలు:

హెచ్ఐవీ సోకిన వారు కొద్ది రోజుల్లోనే చనిపోతారనే అపోహ చాలామందిలో ఉంటుంది. కానీ, దీనికి సరైన చికిత్స తీసుకుంటూ.. తగిన జాగ్రత్తలు పాటించడం వల్ల హెచ్ఐవీ ఉన్న వారు కొన్ని సంవత్సరాల పాటు జీవించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇవి సాధారణంగా దగ్గు, జలుబు, షేక్‌హ్యాండ్స్ ద్వారా ఒకరి నుంచి మరొకరిని వ్యాపింస్తుందని చాలామంది అపోహ పడతారు. ఇది ఎంతమాత్రం నిజం కాదు. అసురక్షిత లైంగిక సంభోగం చేస్తే, జననాంగాల స్రావాల కారణంగా ఒకరి నుండి మరొకరికి ఈ హెచ్ఐవీ వ్యాపిస్తుంది.

హెచ్‌ఐవీ మందులు వాడడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని చాలామంది అనుకుంటారు. ఇది ఏమాత్రం నిజం కాదు. దీనిని పూర్తిగా నివారించలేకపోయినప్పటికీ.. కొన్ని రకాల మందులు ప్రతీరోజూ వాడుతూ, సరైన చికిత్స తీసుకోవడం వల్ల ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉంటుంది.

*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed