- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చలికాలంలో హెయిర్ ఫాల్‌ను తగ్గించి.. జుట్టును దృఢంగా మార్చే సింపుల్ చిట్కాలు
దిశ, ఫీచర్స్: జీవన శైలిలో మార్పులు హెయిర్ ఫాల్‌కు ఓ కారణమని చెప్పుకోవచ్చు. పైగా చలికాలంలో గాలిలో తేమ పెరిగిపోవడం వల్ల జుట్టు ఎక్కువగా పొడి బారినట్లు చిట్లిపోతుంది. హెయిర్ ఎక్కువగా డ్యామేజ్‌కు గురయ్యే అవకాశాలు ఉంటాయి. కాగా హెల్తీ ఫుడ్ తీసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ సమస్యకు చెక్ పెట్టొచ్చు అంటున్నారు నిపుణులు. శరీరమైనా, జుట్టు అయినా హెల్తీగా ఉండాలంటే తప్పకుండా సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి. కాగా విటమిన్స్, ప్రోటీన్లు పుష్కలంగా ఉండే ఫుడ్ తీసుకుంటే జుట్టుకు మంచి పోషణ అందుతుంది. ఫ్రూట్స్, ఆకు కూరలు వింటివి తినాలి. గింజలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. రోజులో ఎక్కువ మొత్తంగా నీరు తాగాలి. దీంతో మీ శరీరం కూడా హైడ్రేట్‌గా ఉంటుంది.
అలాగే చలికాలంలో జుట్టు చిట్లిపోకుండా ఉండాలంటే.. ఉసిరి, వేప, మందార వంటి ఆయుర్వేద మూలికలు ఉపయోగించి పోషకమైన హెయిర్ మాస్క్‌ను రెడీ చేసుకోండి. దీన్ని తలకు పట్టించండి. హెయిర్ బలంగా మారడంతో పాటు హెయిర్ ఫాల్ సమస్యను తొలగిస్తుంది. అలాగే పెరుగు లేదా కొబ్బరి నూనె లో పొడి మూలికలను కలిపి హెయిర్ మాస్క్ తయారు చేసుకోండి. కామన్‌గా ఏ కాలంలోనైనా హెయిర్‌కు నూనె పెట్టుకుంటాం కదా. అదే ఆయిల్‌ను డబుల్ బాయిలింగ్ పద్ధతిలో వేడి చేసి హెయిర్‌కు బాగా పట్టించి మర్దన చేయండి. ఈ విధంగా చేస్తే స్కాల్ఫ్‌లో బ్లడ్ సర్కిలేషన్ బాగా జరిగి జుట్టు కుదుళ్లు బలంగా అవుతాయి. హెయిర్ కూడా పెరగడంతో పాటు చిట్లకుండా ఉంటుంది.