బాస్‌ను ఇంప్రెస్ చేసేందుకు టిప్స్..

by Sujitha Rachapalli |   ( Updated:2024-10-18 14:41:07.0  )
బాస్‌ను ఇంప్రెస్ చేసేందుకు టిప్స్..
X

దిశ, ఫీచర్స్ : బాస్‌‌‌ను ఇంప్రెస్ చేయడం అంటే భజన చేయమని కాదు అంటున్నారు నిపుణులు. మీ టీంకు మీరు ఎంత అవసరమో చెప్పడమే. కొన్ని అలవాట్లు, అభ్యాసాల ద్వారా ఇది సాధ్యం అవుతుండగా.. ఇందుకోసం ముందుగా బాస్, ఎంప్లాయీ మధ్య స్ట్రాంగ్ రిలేషన్ ఏర్పడడం, పాజిటివ్ ఇంప్రెషన్ బిల్డ్ చేయడం ముఖ్యం. కాగా వర్క్ ప్లేస్ లో మీ వాల్యూ పెంచే, మీ ప్రాధాన్యతను వివరించే టిప్స్ ఏంటో తెలుసుకుందాం.

ప్రోయాక్టివ్

టాస్క్‌లు కేటాయించబడే వరకు వేచి ఉండకుండా... అవసరాలను అంచనా వేయండి, ప్రాజెక్ట్‌ల విషయంలో చొరవ తీసుకోండి. సమస్యలు తలెత్తే ముందు వాటికి పరిష్కారాలను అందించండి. ఇది మీ బాస్‌కి మీరు ముందుచూపుతో, విశ్వసనీయత కలిగి ఉన్నారని చూపిస్తుంది.

సిస్టమాటిక్

సమయాన్ని సమర్ధవంతంగా మేనేజ్ చేయడం, పనిని క్రమబద్ధంగా నిర్వహించడం వలన టార్గెట్స్ సులభంగా చేరుకోగలరు. ఈ పద్ధతి మీరు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నారని నిర్ధారిస్తుంది. సిస్టమాటిక్ ఎంప్లాయీస్ సామర్థ్యం, వృత్తి నైపుణ్యం కలిగి ఉంటారని నమ్ముతారు బాస్.

స్పష్టమైన కమ్యూనికేషన్

అడిగే వరకు వేచి ఉండకుండా మీ వర్క్ గురించి అప్‌డేట్ చేయండి. ఇమెయిల్‌లు లేదా మీటింగ్స్.. స్పష్టమైన కమ్యూనికేషన్ నమ్మకాన్ని ఏర్పరచడంలో సహాయపడుతాయి. విషయాలు సజావుగా నడుస్తాయి.

టీమ్ ప్లేయర్‌

సహోద్యోగులతో సహకరించడానికి, జట్టు విజయానికి మద్దతు ఇచ్చేందుకు సుముఖతగా ఉండండి. ఈ పద్ధతి నాయకత్వ లక్షణాలను ప్రదర్శిస్తుంది. మిమ్మల్ని విలువైన ఆస్తిగా చేస్తుంది.

ఉత్సాహం

మీ పని పట్ల సానుకూల దృక్పథాన్ని ప్రదర్శించండి. ఉత్సాహంగా ఉండండి. ఇది మీ రోల్ పట్ల అభిరుచి, నిబద్ధతను ప్రదర్శిస్తుంది. యజమాని నుంచి అభినందనలు అందిస్తుంది.

నిర్మాణాత్మక అభిప్రాయం

కంపెనీ డెవలప్మెంట్ గురించి ఆలోచనలు, సూచనలు ఉంటే పంచుకోండి. నిర్మాణాత్మక అభిప్రాయాన్ని అందించడం వలన మీరు కార్యాలయాన్ని మెరుగుపరచడానికి మార్గాలను అన్వేషిస్తున్నారని నమ్మకం పెరుగుతుంది.

కొత్తగా నేర్చుకోవడం

మీరు పని చేస్తున్న ఇండస్ట్రీలో అప్‌డేట్‌గా ఉండండి. కొత్త నైపుణ్యాలను నేర్చుకోండి. వృత్తిపరమైన అభివృద్ధి అవకాశాలను వెతకండి. స్వీయ-అభివృద్ధి పట్ల నిబద్ధతను చూపడం మీ ఆశయం, అనుకూలతను ప్రతిబింబిస్తుంది.

Advertisement

Next Story

Most Viewed