- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీ పిల్లలు ఫోన్‌కు అడిక్ట్ అయ్యారా.. అయితే ఇలా మాన్పించండి !
దిశ, వెబ్ డెస్క్ : ఒకప్పటి కాలంలో చందమామ రావే జాబిల్లి రావే అని పాటలు పాడితే చిన్నపిల్లలు అన్నం తినే వారు. అమ్మ జోల పాడితే కంటినిండా నిద్రపోయేవారు. మారుతున్న కాలంతో పాటు టెక్నాలజీ కూడా పెరిగిపోతుంది. అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీని విచ్చలవిడిగా వాడుకుంటున్నారు. ముఖ్యంగా మొబైల్ ఫోన్‌ను ముసలివారి నుంచి చిన్నపిల్లల వరకు ప్రతి ఒక్కరూ వాడుతున్నారు. ఈ ఫోన్‌ను ఎక్కువగా వాడడం వలన ఎన్నో సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు ఫోన్‌ను ఎక్కువగా వాడడం ద్వారా కంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఫోన్‌కు ఎక్కువగా అలవాటు పడటంతో తల్లిదండ్రులతో కంటే కూడా ఫోన్‌తోనే ఎక్కువగా సమయం గడుపుతూ ఉంటారు. ఫోన్‌కు అంతగా అలవాటు పడిన పిల్లలను ఆ అలవాటు నుండి ఎలా బయటికి తీసుకురావాలో కొన్ని టిప్స్‌ని ఇప్పుడు తెలుసుకుందాం..
పిల్లల ముందు ఎక్కువగా ఫోన్ వాడకూడదు..
ఇంట్లో ఉండే పెద్దవారి నుంచే పిల్లలు ప్రతి విషయాన్ని గమనిస్తుంటారు. అలాగే తమ ఇంట్లో తల్లిదండ్రులు ఫోన్ ఎలా వాడుతున్నారో చూసి పిల్లలు కూడా నేర్చుకుంటారు. భోజనాల సమయంలో, ఖాళీ దొరికిన సమయంలో ఎక్కువగా ఫోన్ ను వినియోగిస్తూ పెద్దవారిని చూసి పిల్లలు కూడా ఫాలో అవుతారు. అందుకే పిల్లల ముందు మొబైల్ వాడకాన్ని కంట్రోల్ చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే మొబైల్‌లో కాకుండా పిల్లలతో ఎక్కువగా సమయం గడపాలని చెబుతున్నారు.
కథల పుస్తకాలు..
పిల్లలకు చిన్నతనం నుంచే కథల పుస్తకాలు, స్టోరీస్ చదివించే అలవాటు చేయాలి. అలాగే సాహిత్యం, దేశభక్తికి సంబంధించిన పుస్తకాలు కూడా ఎక్కువగా చదివిస్తూ ఉండాలి. వారు పడుకునే సమయంలో మంచి మంచి కథలను చెబుతూ పడుకోబెట్టాలి. ఇలా చేయడం ద్వారా పిల్లలు ఎక్కువగా ఫోన్ కు అలవాటు పడకుండా ఉంటారు.
బయట ఆడుకోనివ్వాలి..
పూర్వం పాఠశాల నుంచి వచ్చిన పిల్లలు ఆరుబయట ఎక్కువగా ఆడుకునేవారు. కాలం మారుతున్నా కొద్ది పిల్లలు ఇంట్లో నుంచి బయటికి వెళ్లడమే మానేస్తున్నారు. పిల్లలు బయటికి వెళతామన్నా పెద్దవారు బయట ఆడుకోనివ్వడం లేదు. దీంతో పిల్లలు ఫోన్‌కు ఎక్కువగా అలవాటు పడుతున్నారు. అలా కాకుండా పిల్లలని ఎక్కువగా బయట ప్రపంచానికి అలవాటు చేయాలి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. పిల్లలు ఉల్లాసంగా ఉంటారు. టీవీలు, ఫోన్‌లకు దూరంగా ఉంటారు.
పిల్లలను బిజీగా ఉంచాలి..
పిల్లలకు సెలవులు ఉన్న రోజుల్లో వారికి ఏదో ఒక పని చెప్పాలి. ఉదాహరణకు గార్డెనింగ్, ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం, డ్యాన్స్, సంగీతం, పెయింటింగ్, డ్రాయింగ్ ఇలాంటివి నేర్పిస్తూ ఉండాలి. దీంతో పిల్లలు కొత్త విషయాలని నేర్చుకోవడమే కాకుండా మొబైల్ వ్యాపకం నుంచి బయటకు వస్తారు.