Tight Cloths: టైట్‌గా ఉండే దుస్తులు ధరిస్తున్నారా?.. అయితే ఈ సమస్యలు తప్పవు

by Prasanna |
Tight Cloths: టైట్‌గా ఉండే దుస్తులు ధరిస్తున్నారా?.. అయితే ఈ సమస్యలు తప్పవు
X

దిశ, ఫీచర్స్ : కొందరు తమ బాడీ ఫిట్‌గా, గ్లామర్‌గా కనిపించాలనే ఉద్దేశంతోనో, ఫ్యాషన్ మీద మక్కువతోనో టైట్‌గా ఉండే దుస్తులు ధరిస్తుంటారు. మరికొందరు అసౌకర్యంగా అనిపించినా మారుతున్న ట్రెండును ఫాలో అవ్వాలన్న ఆసక్తితో డ్రెస్సింగ్ విషయంలో గుడ్డిగా ఫాలో అవుతుంటారు. ఇంకొందరు తమ అభిమాన హీరో, హీరోయిన్లను అనురిస్తుంటారు. ఈ మధ్య చాలా మంది అమ్మాయిలు, అబ్బాయిలు బితుతైన జీన్స్, షార్ట్స్, రకరకాల డ్రెస్సులు వేసుకోవడం ఫ్యాషన్‌గా మారిపోయింది. అయితే అభిరుచులు, అభిమానాలు, ఫ్యాషన్లకంటే కూడా ఇక్కడ ఆరోగ్యం, సౌకర్యం దృష్టిలో పెట్టుకొని మసలు కోవడం మంచిదని నిపుణులు చెప్తున్నారు.

బిగుతైన దుస్తులు సాధారణ సమయాలతో పాటు జర్నీ, స్విమ్మింగ్ లేదా సైక్లింగ్ సమయాల్లోనూ అసౌకర్యానికి గురిచేస్తుంటాయి. బాడీ స్కిన్ పై ఒత్తిడి పెంచుతాయి. బ్లడ్ సర్క్యూట్ పై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. నరాలపై ఒత్తిడి పెరిగి సమస్యలు తలెత్తవచ్చు. తరచూ బిగుతైన జీన్స్, షార్ట్స్ వేసుకునే వారిలో ప్రయివేట్ పార్ట్స్‌పై కూడా ఒత్తిడి పెరిగి సున్నితమైన సమస్యలు తలెత్తుతాయి. ఈ పరిస్థితి పురుషుల్లో సంతానోత్పత్తి సమస్యకు కూడా దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి వస్త్రా ధారణ విషయంలో గుడ్డిగా ఫాలో అవకుండా, సౌకర్యాన్ని బట్టి మసలుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

Next Story