ఆ మూడు రాత్రులతో షుగర్ వ్యాధి.. జర జాగ్రత్త..

by Sujitha Rachapalli |
ఆ మూడు రాత్రులతో షుగర్ వ్యాధి.. జర జాగ్రత్త..
X

దిశ, ఫీచర్స్: సాధారణంగా నైట్ షిఫ్ట్ లతో సరైన నిద్ర లభించదని, దీని వల్ల హెల్త్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందని ఇప్పటికే నిపుణులు హెచ్చరిస్తూ వస్తున్నారు. కానీ ఈ పోటీ ప్రపంచంలో నిలవాలంటే 24గంటలు పనిచేయక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. అందుకే అలాంటి ఉద్యోగాలను కూడా కంటిన్యూ చేస్తున్నారు జనాలు. అయితే ఇంతకు ముందు అధ్యయనాలు చెప్పినట్లుగా కాకుండా జస్ట్ మూడు రోజులు రాత్రి వేళలో పనిచేసినా దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఉందని లేటెస్ట్ స్టడీ హెచ్చరిస్తుంది. మధుమేహం, ఊబకాయం వంటి జీవక్రియ రుగ్మతలు తలెత్తుతున్నాయని తెలిపింది వాషింగ్టన్ స్టేట్ యూనివర్శిటీ అధ్యయనం.

నిజానికి మెదడులోని మాస్టర్ బయోలాజికల్ క్లాక్ .. శరీరాన్ని పగలు, రాత్రి రిథమ్స్ అనుసరించేలా చేస్తుంది. ఈ లయ క్రమరహితంగా మారినప్పుడు ఒత్తిడికి దారితీస్తుంది. రక్తంలో గ్లూకోజ్ నియంత్రణకు సంబంధించిన శరీరంలోని ప్రొటీన్ రిథమ్స్ దెబ్బతిని.. దీర్ఘకాలిక అనారోగ్యాలు తలెత్తుతాయి. అయితే మధుమేహం, ఊబకాయాన్ని నివారించడానికి ముందస్తు జోక్యం సాధ్యమవుతుందని కూడా చెప్తున్నారు పరిశోధకులు.

రక్త నమూనాలను ఉపయోగించి రోగనిరోధక వ్యవస్థ కణాలలో ఉన్న రక్తం ఆధారిత ప్రోటీన్లను గుర్తించారు శాస్త్రవేత్తలు. వీటిలో కొన్ని మాస్టర్ బయోలాజికల్ క్లాక్‌తో ముడిపడి ఉన్నాయి. రాత్రి షిఫ్ట్‌లకు ప్రతిస్పందనలో ఎటువంటి మార్పును చూపించలేదు. కానీ గ్లూకోజ్ నియంత్రణలో పాల్గొన్న ప్రోటీన్‌లు మాత్రం గ్లూకోజ్ లయలను దాదాపుగా పూర్తిగా మార్చడాన్ని గుర్తించారు. ఇన్సులిన్ ఉత్పత్తిలో పాల్గొన్న ప్రక్రియలు సమకాలీకరించబడలేదని కనుగొన్నారు. దీనివల్లే డయాబెటిస్, ఒబేసిటీ వస్తుందని తెలిపారు. దీనితో పాటు మునుపటి అధ్యయనాలు నైట్ షిఫ్ట్ వర్క్ రక్తపోటుపై ప్రతికూల ప్రభావాన్ని చూపి.. గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది.

Advertisement

Next Story