పదే పదే ఫోన్ చూసే వారు.. వీటి గురించి తప్పక తెలుసుకోవాలి

by Prasanna |   ( Updated:2024-06-20 11:52:45.0  )
పదే పదే ఫోన్ చూసే వారు.. వీటి గురించి తప్పక తెలుసుకోవాలి
X

దిశ, ఫీచర్స్: ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంది. ఫోన్ ఇప్పుడు మన జీవితాల్లో ముఖ్యమైన సాధనంగా మారింది. ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ లేకుండా జీవితం బోరింగ్‌గా ఉంటుంది. ఈ ఫోన్ మీ చేతిలో ఉంటే జాబ్ దగ్గర నుంచి అన్ని పనులు సులభంగా చేసుకోవచ్చు. ఆ పరికరం మీ చేతిలో ఉంటే.. మీకు నచ్చిన వారితో గంటలు గంటలు మాట్లాడవచ్చు.

స్మార్ట్‌ఫోన్‌లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని రకాల సమాచారాన్ని పొందడానికి చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. అయితే, దీని వల్ల లాభాలు ఎన్ని ఉన్నాయో.. నష్టాలు కూడా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. అతిగా వాడితే కళ్లు దెబ్బతింటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చాలా మంది ఈ సమస్యను పట్టించుకోకుండా దాదాపు రోజంతా తమ స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగిస్తున్నారు. ఉదయం లేచినప్పటి నుంచి పడుకునే వరకు స్మార్ట్‌ఫోన్‌ వైపు చూస్తూ ఉంటున్నారు. అతిగా స్మార్ట్‌ఫోన్ వాడకం మీ కళ్లకు ఎలా హాని కలిగిస్తుందో తెలుసుకోండి.

కంటి అలసట: ఫోన్‌ని చాలా మంది వదలకుండా చూస్తుంటారు. దీని వల్ల కళ్ళు అలసిపోతాయి. తలనొప్పి, పొడి కళ్ళు, భుజం నొప్పి సమస్యలు వస్తాయి. చిన్న స్క్రీన్‌పై అదే పనిగా చూడటం వలన మీ కళ్లపై ఒత్తిడి పడుతుంది.

బ్లూ లైట్ ఎఫెక్ట్: మీ ఫోన్ స్క్రీన్ నుండి బ్లూ లైట్ వెలువడుతుంది. ఇది వేరే రంగుల కంటే ప్రకాశవంతంగా ఉంటుంది. బ్లూ లైట్ నిద్రకు ముఖ్యమైన మెలటోనిన్ అనే హార్మోన్‌ను తగ్గిస్తుంది. ఇది నిద్ర రుగ్మతలకు కారణం కావచ్చు. అంతేకాకుండా, నీలం కాంతి కంటికి హాని కలిగించవచ్చు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

Advertisement

Next Story

Most Viewed