బ్రెడ్ తినే అలవాటు ఉన్న వారు.. వీటిని తప్పక తెలుసుకోవాలి

by Prasanna |   ( Updated:2023-08-03 06:52:31.0  )
బ్రెడ్ తినే అలవాటు ఉన్న వారు.. వీటిని తప్పక తెలుసుకోవాలి
X

దిశ, వెబ్ డెస్క్: మనలో చాలామంది టీ తో బ్రెడ్ తీసుకుంటారు. ఇతర దేశాల్లో ఉన్నవాళ్లు ఖచ్చితంగా బ్రెడ్ ముక్కలను తీసుకుంటూ ఉంటారు. కొంతమంది బ్రెడ్ తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని తినకుండా ఉంటారు. కానీ కొన్ని పరిశోధనల ప్రకారం బ్రెడ్ తీసుకోవడమే చాలా మంచిదంటూ వైద్య నిపుణులు వెల్లడించారు. వీటి వల్ల మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ చూద్దాం..

అయితే సాధారణ బ్రెడ్ కన్నా బ్రౌన్ బ్రెడ్ తీసుకోవడం మంచిదట. ఎందుకంటే దీనిలో ఫైబర్,ఐరన్ విటమిన్ బి, పోలేట్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ప్రతి రోజు ఉదయం దీన్ని వల్ల మన జీర్ణశక్తి కూడా మెరుగుపడి మనకు మలబద్ధకం, కడుపు నొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి. జ్వరం వచ్చినా ముందు బ్రెడ్ తినమని చెబుతుంటారు. ఎందుకు తినమని చెబుతారంటే .. ఇతర పదార్థాలు తినడానికి శక్తి లేకపోయినా బ్రెడ్ ను తొందరగా తినగలుగుతారు కాబట్టి దీనిని తీసుకోమని సూచిస్తారు. అంతేకాక మనలో కొంతమంది అప్పుడప్పుడు కళ్ళు తిరిగి పడిపోతుంటారు. దానికి కారణం మన రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ తగ్గిపోవడమే. అలాంటి సమయంలో పీనట్ బటర్ బ్రెడ్ తీసుకుంటే రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగి ఆరోగ్యం మెరుగు పడుతుంది.

Read More: మైండ్ డైట్ ఫర్ చిల్డ్రెన్

Advertisement

Next Story

Most Viewed