కాలి రెండో వేలు పొడవుగా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే జరిగేది ఇదే..!

by Prasanna |
కాలి రెండో వేలు పొడవుగా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే జరిగేది ఇదే..!
X

దిశ, వెబ్ డెస్క్ : మన దేశంలో పెళ్ళికి ( Marriage ) ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఒకప్పుడు అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూసి పెళ్లి చేసే వాళ్ళు. ఇక ఇప్పుడు, ఒకరికొకరు నచ్చితే వెంటనే పెళ్లి చేస్తున్నారు. ఎవరి ఆచారాల ప్రకారం వారు వివాహం చేసుకుంటారు. ఒక అమ్మాయిని కోడలిగా చేసుకోవాలనుంటే అత్తింటి వారు ముందు ఆమె కట్టుబొట్టు, కుటుంబం ఎలా ఉందనేది అన్ని చూస్తారు. అలాగే, నుదుటి నుండి కాలి పాదాలవరకు అన్నీ గమనించిన తర్వాతే పెళ్లి పీటల వరకు వెళ్తారు. కాలి వేళ్ళను బట్టి వాళ్లు ఎలా ఉంటారనేది తెలుసుకుంటారు.

ముఖ్యంగా, అమ్మాయికి కాలి బొటనవేలు కంటే పక్కనే వేలు పొడుగ్గా ఉంటే అన్ని విషయాల్లో ఆమెదే పై చేయి అని పండితులు అంటున్నారు. బొటన వేలు పొడవుగా ఉంటే అత్తింటి వారికి బాగా కలిసి వస్తుందట. అంతే కాదు, వీరు ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉంటారు. అన్ని వేళ్ళకంటే బొటనవేలు పొట్టిగా ఉంటే, ఆ అమ్మాయి ఎలాంటి పనులైన తేలికగా చేస్తుందట.

కాలి రెండు, మూడో వేలు సమానంగా ఉంటే వారు ఇతరుల మీద ఎప్పుడూ గెలుస్తారు. కాలి రెండో వేలు అన్ని వేళ్ళ కంటే పొట్టిగా ఉంటే వాళ్ళు, కొత్త వాళ్ళతో ఈజీగా కలిసి పోతారట. బొటన వేలు పక్కన రెండు వేళ్ళు సమానంగా ఉంటే, వారు బలంగా ఉంటారట. ఇలాంటి అమ్మాయిల్లో ఎంతో శక్తి ఉంటుంది. మొదటి నాలుగు వేళ్లు సమానంగా ఉంటే కుటుంబానికి ఎక్కువ విలువ నిస్తారని పండితులు చెబుతున్నారు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.

Next Story

Most Viewed