- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పెళ్లిలో వధూవరులు ఏడు అడుగులే ఎందుకు వేస్తారో తెలుసా?
దిశ, వెబ్‌డెస్క్ : పెళ్లి, రెండు మనుసుల నూరేళ్ల జీవితం ముడిపడి ఉంటుంది. ఇక హిందు సంప్రదాయంలో జరిగే పెళ్లిలో ఎన్నోతంతులుంటాయి. ఒక్కొక్కదానికి ఒక్కో అర్థం ఉంటుంది.మూడు ముళ్లు, కన్యాదానం, జీలకర్ర బెల్లం, ఇలా ఎన్నో ఉంటాయి. అయితే పెళ్లిలో ఏడు అడుగులు కూడా ఒకటి. అసలు పెళ్లిలో ఏడు అడుగులు ఎందుకు వేస్తారో చాలా మందికి తెలియదు. కాగా,హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగే పెళ్లిలో కాబోయే వారితో ఏడడుగులు నడిస్తే ఏడు జన్మలు కలిసున్నట్లేనని అర్థం అంట. పెళ్లిల్లో హోమం చుట్టూ కాబోయే దంపతులు ఏడడుగులు నడుస్తున్నారు. వారు వేసే ప్రతి అడుగు ప్రత్యేకమైనదే. ఒక్కో అడుగుకు ఒక్క మంత్రాన్ని అర్చకులు పఠిస్తుంటారు. కాగా, అసలు ఆ ఏడు అడుగులకు ఉన్న పరమార్థం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మొదటి అడుగు:‘ఏకం ఇషే విష్ణు: త్వా అన్వేతు’.. కాబోయే భర్త లేదా భార్యతో కలిసి అగ్ని సాక్షిగా మొదటి అడుగు వేస్తున్నాను. జీవితాంతం మన ఇద్దరిని కాపాడాలని ఆ విష్ణును కోరుకుంటున్నాం.
రెండో అడుగు:‘ద్వే పూర్ణే విష్ణు: త్వాత అన్వేతు’.. జీవితంలో ఎన్నో కష్టాలు, నష్టాలు ఎదురవుతాయి. వాటి నుంచి మమ్మల్ని గట్టెక్కించుగాక.. ఆ కష్టాలను ఎదుర్కోవడానికి మాకు శక్తి నివ్వండి స్వామి.
మూడో అడుగు: ‘త్రీణి వ్రతాయ విష్ణు: త్వా అన్వేతు’.. మేము జరిపించే ఈ వివాహ వ్రతాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడు విష్ణు..
నాలుగో అడుగు:‘చత్వారి మయోభవాయ విష్ణు: త్వా అన్వేతు’.. నిత్యం దు:ఖాలతో నిండిన జీవితాన్ని ఆనందాన్ని కలిగించాలని ఆ విష్ణువును వేడుకోవడం.
ఐదో అడుగు:‘పంచ పశుభ్యో విష్ణు: త్వా అన్వేతు’.. వ్యవసాయంలో భాగంగా పశు సంపదను ఇవ్వాలని విష్ణువును కోరడం..
ఆరో అడుగు: ‘షడృతుభ్యో విష్ణ: త్వా అన్వేతు’.. ఆరు రుతువులు మనకు సుఖమిచ్చు గాక..
ఏడో అడుగు:‘సప్తభ్యో హోతాబ్యో విష్ణు: త్వా అన్వేతు’.. ఇంట్లో ధర్మ నిర్వహణకు విష్ణు అనుగ్రహం కలుగు గాక..
Read more:
పెళ్లిలో మూడుముళ్లే ఎందుకు వేస్తారు..! శాస్త్రం ఏం చెబుతుందంటే..?