- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దట్టమైన అడవుల్లో దొరికే ఈ చీమల ఫ్రై గురించి తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు! ఈ సమస్యలు ఇట్టే మాయం!
దిశ, ఫీచర్స్: మనం ఇళ్లల్లో చీమలు ఉంటే పెద్ద సమస్యగా ఫీల్ అవుతుంటాం. ఇంట్లో ఏదైనా పదార్థం (పాలు, పెరుగు, పంచదార, స్వీట్లు)వాటి కంటికి కనిపిస్తే చాలు ఐదు, పదినిమిషాల్లో అక్కడకు చేరుకుంటాయి. చీమలు బ్యాక్టీరియాని మన ఆహారంలో చేర్చే ట్రాన్స్‌మిటర్లుగా కూడా పని చేస్తాయి. 2005లో జరిగిన ఓ అధ్యయనంలో పరోహ్ యాంట్ అనే ఓ రకం చీమ వల్ల ఆస్తమా, శ్వాసకోశ సంబంధమైన అలర్జీలు వస్తున్నాయని వెల్లడైంది.
కానీ ఈ చీమల్ని తింటే పలు అనారోగ్య సమస్యలు దూరమవుతాయని కొందరు నమ్ముతారు. అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన చీమల ఫ్రై గురించి వింటే ఆశ్చర్చపోతారు. ఉమ్మడి ఖమ్మం, ఛత్తీస్‌గఢ్ అడవుల్లో నివసించే ఆదివాసులు అడవిలోని చెట్లపై గూళ్లు పెట్టుకుని జీవించే ఎర్ర చీమలను పట్టితెస్తారు. ఆ గూళ్లపై మంటపెట్టి చనిపోయిన చీమలను, వాటి గుడ్లను సేకరిస్తారు. వాటిలో మిరపకాయలు ఉప్పు కలిపి చట్నీ నూరుతారు. ఆ చట్నీని భోజనంలో ఉపయోగిస్తారు. గొత్తి కోయ తెగకు చెందిన ఆదివాసులు ప్రధానంగా ఇలా చేస్తారు.
చిన్న చీమ కుడితేనే అమ్మో అంటారు. అలాంటిది పెద్ద పెద్ద చీమలను చెట్టు, పుట్టల వెంబడి వెతికి... చీమల పుట్టలను కట్టెలతో కిందకు దులుపుతారట. అవి కుట్టినా నొప్పిని భరించుకుని.. వాటిని మంట పెట్టి చనిపోయిన తర్వాత బుట్టలో వేసుకుంటారట. ఇంటికి తీసుకువెళ్లి ఫ్రై చేసుకుని లొట్టలేసుకుంటూ తింటారట. చీమల గుడ్లను కూడా అగ్గిపై కాల్చి ఫ్రై చేసుకుని కుటుంబ సభ్యులంతా కమ్మగా తింటారట.
ఎంతో రుచికరంగా ఉండే ఈ చీమల ఫ్రై తినడం వల్ల మనిషి ఎంతో బలంగా ఉంటాడని, కంటి సమస్యలు, కీళ్ల నొప్పులు తలెత్తకుండా ఉంటాయని ఆదివాసీలు నమ్ముతారట. చీమలు కేవలం ఎండాకాలం స్టార్టింగ్‌లోనే కొన్ని రకాల చెట్లపై మాత్రమే పుట్టలను లేదా గూళ్లను ఏర్పాటు చేసుకుని గుడ్లు పెడతాయట. అవి ఎక్కడున్నా సరే ఈ ఆదివాసులు అక్కడకు వెళ్లి మరీ తీసుకొచ్చుకుంటారట.