Parents-Children : మీ పిల్లలతో ఇలా డీప్ కనెక్షన్ ఏర్పరుచుకోండి...

by Sujitha Rachapalli |   ( Updated:2024-07-27 05:36:45.0  )
Parents-Children : మీ పిల్లలతో ఇలా డీప్ కనెక్షన్ ఏర్పరుచుకోండి...
X

దిశ, ఫీచర్స్: తల్లిదండ్రులు పిల్లలతో డీప్ కనెక్షన్ ఏర్పరచుకోవడం వారి ఎదుగుదల, పూర్తి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. దీర్ఘకాలిక బంధాన్ని క్రియేట్ చేసుకోవడంలో సహాయం చేస్తుంది. నమ్మకం, అవగాహన, పరస్పర గౌరవం పెంపొందిస్తుంది. చిన్నారుల జీవితం సరైన మార్గంలో పయనించేలా.. ఉన్నతస్థాయికి ఎదిగేందుకు హెల్ప్ అవుతుంది. సమాజంలో ప్రత్యేకత కలిగి ఉండేలా చేస్తుంది. మరి ఈ లోతైన బంధాన్ని సృష్టించడం కోసం పేరెంట్స్ ఏం చేయాలి? పిల్లలతో ఏ విధంగా మసులుకోవాలి? తెలుసుకుందాం.

ప్రేమ భాష

ప్రతీ చిన్నారి తమ ప్రేమను వ్యక్తం చేసే విధానం ఒకరి నుంచి మరొకరికి డిఫరెంట్ గా ఉంటుంది. కాబట్టి వారి లవ్ లాంగ్వేజ్ అర్థం చేసుకున్నట్లయితే.. వారికి నచ్చిన విధంగా లవ్ ఎక్స్ ప్రెస్ చేసినట్లయితే హ్యాపీగా ఫీల్ అవుతారు. బహుమతులు ఇవ్వడం, ఆడుకోవడం, నాణ్యమైన సమయాన్ని కేటాయించడం, ఆప్యాయంగా ఇచ్చే ముద్దు కౌగిలింతలు వారిని ఉల్లాసంగా ఉత్సాహంగా మారుస్తాయి. తమ తల్లిదండ్రులకు తాము ప్రత్యేకమని అనుకుంటారు. గౌరవిస్తారు.

హీనంగా చూడొద్దు

పిల్లలు చెప్పే మాటలను పూర్తిగా వినండి. వాటిని రెస్పెక్ట్ చేయండి. తప్పు ఒప్పు చెప్పండి. అంతేకానీ హీనంగా చూడొద్దు అంటున్నారు నిపుణులు. వారికి విలువ, గౌరవం ఇవ్వాలని సూచిస్తున్నారు. ఈ పద్ధతి వారిలో కాన్ఫిడెన్స్ పెరగడంలో సహాయపడుతుంది. మీతో స్పెషల్ బాండ్ ఏర్పడేలా చేస్తుంది.

మాటల్లో హాస్యం అవసరం

పిల్లలతో డీప్ కనెక్షన్ క్రియేట్ చేసుకునేందుకు నవ్వు గొప్ప మార్గం. రోజువారీ మాటల్లో కామెడీ ఉండటం వారికి ఆనందాన్నిస్తుంది. ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేస్తుంది. జోక్స్, ఫన్నీ స్టోరీస్, హెల్తీ టీజింగ్ కుటుంబంలో సంతోషకర వాతావరణాన్ని నింపుతుంది. అందరినీ రిలాక్సింగ్ గా ఉంచుతుంది.

లక్ష్యాలకు మద్దతు

చిన్నారుల లక్ష్యాలు, ఆసక్తులకు ప్రయారిటీ ఇవ్వండి. వారికి నచ్చిన స్పోర్ట్స్, సబ్జెక్టు, ప్రాజెక్ట్, హ్యాబిట్.. ఇలా ప్రతి విషయంలో హెల్ప్ చేయండి. వారి టార్గెట్స్ రీచ్ అయ్యేందుకు కలిసి పని చేయండి. ఈ పద్ధతి వారికి గ్రూప్ వర్క్ అండ్ సక్సెస్ గురించిన పాఠాలను బోధిస్తుంది.

కుటుంబంతో స్పెండ్ చేయడం

కుటుంబం కోసం టైం కేటాయించడం పిల్లలతో బంధాన్ని బలపరుస్తుంది. వీక్లీ గేమ్ నైట్, మూవీ మారథాన్, విహారయాత్రలు ప్లాన్ చేసుకోవాలి. ఈ సమయంలో కలిగే స్పెషల్ మూమెంట్స్ ఎప్పటికీ గుర్తుండిపోతాయి. తమ తల్లిదండ్రుల పట్ల గౌరవం పెరుగుతుంది.

కలిసి ఇంటి పనులు చేయడం

పిల్లలను ఇంటి పనుల్లో ఇన్వాల్వ్ చేయడం ద్వారా వారికి బాధ్యతలను నేర్పడమే కాదు ఆ సమయంలో ఏర్పడే క్షణాలు ప్రత్యేక బంధాన్ని ఏర్పరుస్తాయి. మీ చిల్డ్రన్ తో స్పెషల్ బాండ్ మెయింటైన్ చేసేందుకు సహాయం చేస్తాయి. కిచెన్ క్లీనింగ్, వంట, ఇంటిని శుభ్రపరచడం, తోట పని వంటివి సరదాగా ఉంటూనే కొత్త విషయాలు నేర్చుకునేలా చేస్తాయి. సరికొత్త అనుభవాలను అందిస్తాయి. గ్రూప్ ఇంపార్టెన్స్, హెల్ప్ ఫుల్ నేచర్ గురించి తెలుసుకోగలుగుతారు.

క్రియేటివిటీ ఎంకరేజ్ చేయండి

పెయింటింగ్, మ్యూజిక్, రిటెన్ నోట్స్.. ఏదైనా పిల్లలు కొత్తగా ట్రై చేస్తున్నప్పుడు ప్రోత్సహించాలి. వారి భావ వ్యక్తీకరణకు మద్దతు ఇవ్వాలి. ఈ అలవాటు వారికి సమాజంలో ప్రత్యేకతను అందించడమే కాదు.. మీతో స్పెషల్ రిలేషన్ ఏర్పడేలా చేస్తుంది. అందుకే వారి క్రియేటివ్ వర్క్ లో మీరూ భాగం అవ్వండి. చేస్తున్న ప్రయత్నాలను అభినందించండి. ఇందుకు సరైన అట్మాస్పియర్ క్రియేట్ చేయండి.

అర్థవంతమైన మాటలు

పిల్లలతో సమయాన్ని గడిపేటప్పుడు డీప్ కన్వర్జేషన్ అవసరం. వారి కలలు, ఆలోచనలు, ఆందోళనలు వినండి. వాటిపై చర్చించండి. ఈ సమయంలో మీ అనుభవాల గురించి చెప్పండి. విలువల గురించి వివరంగా మాట్లాడండి. ఈ సంభాషణ పరస్పర అవగాహనను పెంచుతుంది. భావోద్వేగ బంధాన్ని బలపరుస్తుంది.

Advertisement

Next Story

Most Viewed