underwear: మహిళలు అండర్వేర్ విషయాల్లో తీసుకోవాల్సి జాగ్రత్తలు ఇవే.. అస్సలు మిస్ అవ్వొద్దు!

by sudharani |
underwear: మహిళలు అండర్వేర్ విషయాల్లో తీసుకోవాల్సి జాగ్రత్తలు ఇవే.. అస్సలు మిస్ అవ్వొద్దు!
X

దిశ, సినిమా: మహిళలు లోదుస్తులు ధరించడం చాలా అవసరం. ఇన్నర్స్ వేసుకోవడం వల్ల శరీర ఆకృతిని మంచిగా కనిపించడమే కాకుండా.. కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. అయితే.. కొంత మంది రోడ్ సైడ్ దొరికేవి, లేక తక్కువ రేట్లకు వస్తున్నాయని ఎలాంటి పడితే అలాంటివి వాడేస్తుంటారు. అలాంటి వాటి వల్ల యోని ఇన్ఫెక్షన్లకు గురవుతుంది. మరి యోని ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, పరిశుభ్రంగా ఉండటానికి ఎలాంటి ప్యాంటీలు ఎంచుకోవాలనేది ఇప్పుడు తెలుసుకుందాం.

* సాధారణంగా అండర్వేర్ కోనుగోలు చేసేటప్పుడు మొదట దాని ఫ్యాబ్రిక్‌పై దృష్టి పెట్టాలి. ఎందుకంటే మహిళల శరీరంలో యోని అనేది చాలా సున్నితమైన భాగం. అందుకే ఎల్లప్పుడూ కాటన్‌తో తయారు చేసిన వస్త్రాన్ని ఉపయోగించాలి. కాటన్ దుస్తులు చెమటను గ్రహించి.. ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడతాయి.

* కొంతమంది లో దుస్తుల్లో కూడా స్టైలిష్‌గా, ఫ్యాషన్‌గా ఉండేవి ఎంచుకుంటారు. అలాంటి అస్సలు చేయోద్దు. వీటి వల్ల యోని చుట్టూ ఎర్రగా అయ్యి.. దద్దుర్లు వస్తాయి.

* ముఖ్యంగా లో దుస్తులు కొనుగోలు విషయంలో ధరను పరిగణనలోకి తీసుకోకూడదు. మంచి నాణ్యమైన అండర్వేర్ కోనుగోలు చేసుకోవాలి. నాణ్యతలేనివి యోని ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతాయి.

* సీజన్ ఏదైనా ప్రతిరోజూ లోదుస్తులను మార్చడం చాలా అవసరం. ఒకే ప్యాంటీని ఎక్కువ రోజులు ఒకటే ధరించడం వల్ల యోని ఆరోగ్యం దెబ్బతింటుంది.

* ఒకసారి వాడిన లోదుస్తులు ఉతక్కుండా మరోసారి ఉపయోగించకూడదు. అలా చేస్తే వాటిలో ఉండే చెమట, మలం, మూత్ర కణాల కారణంగా ఇన్ఫెక్షన్ అయ్యే ప్రమాదం ఉంటోంది. అలాగే అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు నిపుణులు.

* ఇక ఫ్యాంటీస్‌ని గోరువెచ్చని నీరు, డిటర్జెంట్ ఉపయోగించి మంచిగా వాష్ చేసుకోవాలి. కుదిరితే సూర్యకిణాలు పడే చోట వాటిని ఆరబెట్టాలి. అలా అయితే వాటిలో ఉండే క్రిములు నశిస్తాయి.

Advertisement

Next Story

Most Viewed