Immunity Foods: వర్షాకాలంలో ఇమ్యూనిటీని పెంచే ఫుడ్స్ ఇవే..

by Prasanna |
Immunity Foods: వర్షాకాలంలో ఇమ్యూనిటీని పెంచే ఫుడ్స్ ఇవే..
X

దిశ, ఫీచర్స్ : సాధారణంగా వైద్యులు వర్షాకాలంలో కొన్ని ఆహార పదార్ధాలను దూరం పెట్టమని చెబుతుంటారు. వర్షాల వల్ల వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. అదే సమయంలో అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. దీనికి ప్రధాన కారణం ఇన్‌ఫెక్షన్లు, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం. వానా కాలంలో ఇమ్యూనిటీని పెంచే కూరగాయలను తీసుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ చూద్దాం..

ఆనపకాయను మనం నిత్యం తింటూనే ఉంటాము. దీనిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇది శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. దీనిలో విటమిన్ సి, కాల్షియం, ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి, ఈ కూరగాయని తినని వారు అలవాటు చేసుకోండి. దీనిలో ఉండే ఫైబర్ జీర్ణక్రియ పని తీరును మెరుగుపరుస్తుంది.

కాకరకాయను మనలో చాలామంది దూరం పెడతారు. కానీ, ఇది మన ఆరోగ్యానికి మంచిది. ఎందుకంటే, దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి ఉంటాయి. ఇమ్యూనిటీ పవర్ ని పెంచుతుంది.ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తుంది.

టొమాటోని కూడా వర్షాకాలంలో ఎక్కువగా తీసుకోవాలి. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. విటమిన్ సి మన శరీరంలో వైట్ బ్లడ్ సెల్స్ ని పెరిగేలా చేస్తాయి.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

Advertisement

Next Story

Most Viewed