- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మెదడును మాయ చేస్తున్న కళ్లు.. ఇలాంటి ట్రిక్స్ అసలు ఊహించలేము..
దిశ, ఫీచర్స్ : కొన్నిసార్లు మన కళ్లను మనమే నమ్మలేం అంటుంటారు పెద్దలు. ఎందుకంటే ఆయా పరిస్థితులను బట్టి అవి మనల్ని అలా మాయ చేస్తుంటాయి. మనం చూసిన వస్తువులు, ప్రాంతాలు, ఆయా దృశ్యాల గురించిన స్వభావం అవి మనకు ఎంతమేర కనిపించాయి. స్పష్టంగా కనిపించాయా? అస్పష్టంగా కనిపించాయా? అనే దానిని బట్టి మన మెదడుకు సంకేతాలు అందుతాయి. వాటినే మనం రికార్డు చేసుకుంటాం. ఈ క్రమంలోనే కొన్నిసందర్భాల్లో కళ్లు మన మెదడుకు తప్పుడు సంకేతాలు అందించే అవకాశం ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. హ్యూమన్ విజువల్ సిస్టమ్ అట్మాస్పియర్‌లో వస్తువుల పరిమాణం గురించి తప్పుడు అంచనాలను రూపొందించేలా మెదడును మాయ చేయగలదని తెలిపింది.
ఈ విషయాన్ని తెలుసుకోవడానికి యూనివర్సిటీ ఆఫ్ యార్క్, ఆస్టన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల బృందం కొందరు పార్టిసిపెంట్స్‌కు ఫుల్ స్కేల్ రైల్వే దృశ్యాల ఇమేజెస్‌ను అందించింది. ఇందులో వాటి ఎగువ, దిగువ భాగాలను అస్పష్టంగా కనిపించేలా చేసింది. అలాగే అస్పష్టంగా లేని రైల్వేల చిన్న-స్థాయి (small-scale) మోడల్ ఛాయా చిత్రాలను కూడా ఇచ్చింది. పార్టిసిపెంట్స్ ప్రతీ ఇమేజ్‌ని పోల్చుకోవాలని, రియల్ ఫుల్ స్కేల్ రైల్వే దృశ్యం ఏదో గుర్తించాలని కోరింది. ఫలితాల్లో అస్పష్టమైన భాగాలు నిజమైన రైళ్లు మోడల్‌ల కంటే చిన్నవిగా ఉన్నాయని పార్టిసిపెంట్స్ చెప్పగా.. వస్తువు పరిమాణం అంచనా వేయడంలో ఎలా మోసపోతున్నామో నిర్ధారించింది.
హ్యూమన్ విజువల్ సిస్టమ్ అత్యంత అనువైనదని పరిశోధనలు పేర్కొంటున్నాయి. కొన్నిసార్లు ‘డిఫోకస్ బ్లర్’ అని పిలువబడే వాటిని ఉపయోగించడం ద్వారా సైజ్‌కు సంబంధించిన కచ్చితమైన అవగాహన కలిగి ఉండవచ్చు. కానీ ఇతర సమయాల్లో ఇతర ప్రభావాలకు లోబడి, రియల్ వరల్డ్ వస్తువు పరిమాణాన్ని అర్థం చేసుకోవడంలో విఫలమవుతుంది. మొత్తానికి పరిశోధనలు మానవులకు, బాహ్య ప్రపంచానికి మధ్య ఉన్న సంబంధం గురించి గ్రహణాత్మక జడ్జిమెంట్లలో మానవ మెదడు ఉపయోగించే ట్రిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ కొత్త అంతర్ దృష్టిని అందిస్తాయి.
Read more: