- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘పెళ్లి చేసుకోని పిల్లల కోసం తప్పు పనులు చేస్తారు..’ ఎగ్జామ్‌లో విద్యార్థి షాకింగ్ ఆన్సర్!
దిశ, వెబ్‌డెస్క్: చిన్న పిల్లలు ఏం చేసినా చాలా ముచ్చటగా అనిపిస్తుంది. వాళ్లు బుడిబుడి అడుగులు చూస్తున్నా.. వారి ముద్దు ముద్దు మాటలు వింటున్నా ఎక్కడా లేని ఆనందాన్ని కలిగిస్తాయి. చిన్నతనంలో వారు మాట్లాడే ప్రతీమాట వినసొంపుగా ఉంటాయి. కొన్నిసార్లు చిన్నపిల్లలు వారి తల్లిదండ్రుల పెళ్లి ఫొటోలు చూస్తూ నేను మీ పెళ్లి ఫొటోల్లో ఎందుకు లేను అని అడుగుతుంటే ఏం సమాధానం చెప్పాలో తెలియక తల్లిదండ్రులు బిత్తరపోతుంటారు. ఇక ఒక్కోసారి క్యూట్ క్యూట్‌గా మాట్లాడే పిల్లల్ని ఏదైనా ప్రశ్నలు అడిగితే వారు చెప్పే సమాధానాలు కూడా ఫన్నీగా ఉంటాయి.
కాగా ఎగ్జామ్‌లో ఓ ప్రశ్నకి చిన్నారి రాసిన సమాధానం కడుపుబ్బా నవ్విస్తుంది. ఆ సమాధానం నెట్టింట తెగవైరల్ అవుతోంది. ఇంతకీ ఆ ప్రశ్న, సమాధానం ఏంటి అనుకుంటున్నారా..? అయితే ఇప్పుడు తెలుసుకుందాం.. ఓ పాఠశాలలో చదివే బుడతడు సాంఘీక శాస్త్రం ప్రశ్న పత్రంలో పెళ్లంటే ఏంటి ? అని ఓ 10 మార్కుల ప్రశ్నను అడిగారు. ఆ ప్రశ్న చదివిన విద్యార్థి చాలా గమ్మత్తుగా సమాధానం రాశాడు.
'పెళ్లంటే.. ఒక అమ్మాయి పెద్దగవ్వగానే అమ్మాయి తల్లిదండ్రులు ఆమెతో ఇక నువ్వు పెద్దగయ్యావు.. నిన్ను మేము పోషించలేము అని చెబుతారు. నిన్ను పోషించే వ్యక్తిని నువు వెతుక్కొని పెళ్లి చేసుకో అని చెబుతారు. అప్పుడు ఆ అమ్మాయి తనను పోషించే వ్యక్తి కనపడగానే అబ్బాయి అమ్మాయి ఒకరినొకరు పరీక్షించుకుని పెళ్ళిచేసుకుంటారు. ఆ తరువాత పిల్లలకోసం తప్పు పనులు చేస్తారు'.. ఇలా ఆ చిన్నోడు సమాధానం రాశాడు. ఆ సమాధానాన్ని చదివిన టీచర్ కోపంతో సమాధానాన్ని కొట్టేసి సున్నా మార్కులు వేశారు. @srpadaa అనే ట్విట్టర్ యూజర్ ఈ సమాధాన పత్రాన్ని తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేశారు. ఈ సమాధాన పత్రం ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పిల్లలకు అవగాహన లేని ఇలాంటి ప్రశ్నలను అడిగితే ఇలాంటి సమాధానాలే వస్తుంటాయి. ఈ సమాధానం చూసిన నెటిజన్లు ఆ పిల్లాడికి మేం 10కి 10 మార్కులు ఇస్తాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి: టచ్ స్క్రీన్ ఎయిర్‌పాడ్స్.. వీడియో కాల్స్, మూవీస్ చూసేయొచ్చు..