జెర్రిగొడ్డును అమాంతం మింగేసిన కింగ్ కోబ్రా.. తర్వాత ఏమైందంటే!

by Kavitha |
జెర్రిగొడ్డును అమాంతం మింగేసిన కింగ్ కోబ్రా.. తర్వాత ఏమైందంటే!
X

దిశ, ఫీచర్స్: సాధారణంగా పాములు అన్ని కూడా మాంసాహారులే. తమ ఆకలిని తీర్చుకునేందుకు బల్లులు, కప్పలు, కీటకాలు, జంతువులు, గుడ్లతో పాటు అదే జాతికి చెందిన మరో పాములను కూడా తినేస్తుంటాయి. కప్పను పాము మింగడం చూస్తుంటాం. కానీ పామును, మరో సర్పం అమాంతంగా మింగేయడం చూశారా. ఇప్పుడు ఇలాంటి సంఘటనే అనకాపల్లి జిల్లాలోని వి.మాడుగుల మండలం రామచంద్రపురంలోని ఓ పొలంలో జరిగింది.


అసలు విషయంలోకి వెళితే.. గ్రామ శివారు జిమినీ జగ్గ అనే రైతు పొలంలో సుమారు 12 అడుగుల గిరినాగు జెర్రిగొడ్డు అనే పామును చూస్తుండగానే మింగేసింది. అది చూసిన రైతు ఒక్కసారి భయభ్రాంతులకు గురై స్నేక్ క్యాచార్ వెంకటేష్‌కి సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న వెంకటేష్ పామున్నచోటికి రాగా.. అప్పటికే జెర్రిగొడ్డును మింగిన కింగ్ కోబ్రా అక్కడ నుంచి జారుకుంది. అయితే కింగ్ కోబ్రాలు.. జీవవైవిద్యంలో ప్రధాన పాత్ర పోషిస్తాయని.. తన జోలికి వెళ్లకపోతే అవి కూడా మనుషులకు ఎటువంటి హాని చేయవని అంటున్నారు స్నేక్ క్యాచర్


చివరికి పన్నెండడుగుల భారీ కింగ్ కోబ్రా, ఐదడుగుల పొడవున్న జెర్రిగొడ్డు చేసిన పోరాటంలో కింగ్ కోబ్రా ముందు జెర్రిగొడ్డు తలోంచాల్సి వచ్చింది.






Advertisement

Next Story

Most Viewed