'మిస్టీరియస్ ట్రీ' సీరియల్ కిల్లర్

by Hajipasha |   ( Updated:2022-10-08 16:42:26.0  )
మిస్టీరియస్ ట్రీ సీరియల్ కిల్లర్
X

దిశ, ఫీచర్స్: యూఎస్‌లోని ఒరెగాన్‌, పోర్ట్‌లాండ్ శివారు ప్రాంతమైన గ్రేషమ్‌లో 'గ్రేషమ్ లంబర్‌జాక్' చెట్లను అకారణంగా నరుకుతున్న వ్యక్తిని పట్టుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే అతను ఆ ప్రాంతంలోని దాదాపు 700 చెట్లను నరికివేసినట్లుగా అనుమానిస్తున్నారు. గ్రేషమ్ పోలీస్, పార్క్స్ అండ్ రిక్రియేషన్స్ కలిసి ఏర్పాటు చేసిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్ టీమ్ స్థానిక అడవికి సంబంధించిన వేలాది ఫొటోలను శోధిస్తోంది.

ఈ 'ట్రీ సీరియల్ కిల్లర్' ఏడాదికాలంగా ధైర్యంగా చెట్లను నరికివేస్తూ పట్టుబడటం లేదు. అయితే సదరు నిందితుడు సెవెంత్ స్ట్రీట్ బ్రిడ్జ్, టౌల్ అవెన్యూ మధ్య ట్రయల్‌లోని ఒక భాగంలో చెట్లను ఇష్టపడుతున్నాడని, చేతి రంపం లేదా విల్లు రంపంతో నరికేస్తున్నాడని తెలుస్తోంది.ఈ అపరిచిత వ్యక్తి తన దగ్గరున్న విల్లు రంపంతో కేవలం 5-10 నిమిషాల్లోనే ఒక చెట్టును కట్ చేస్తున్నాడని గ్రేషమ్ పి & ఆర్ మేనేజర్ జో వాల్ష్ చెప్పారు. నేలకొరిగిన దుంగల్లో ఆ రంపపు ఆనవాళ్లు బయటపడ్డాయని.. ఇవి చాలా పదునైన బ్లేడ్స్ కలిగి ఉంటాయని చెప్పారు. 2021 ఆగస్టులో గ్రేషమ్ లంబర్‌జాక్ నరికివేతకు గురవడాన్ని నగర సిబ్బంది మొదటిసారి గమనించారు.

ఎక్కువగా నరికివేతకు గురయ్యే ప్రదేశంలో అధికారులు రహస్య కెమెరాలు ఏర్పాటు చేసినప్పటికీ ఇంకా పట్టుబడలేదు లేదా కనీసం వారి గుర్తింపుపై ఎలాంటి లీడ్స్‌ను పొందలేదు. ఈ మేరకు సదరు అపరిచిత నేరస్థుడు ఇప్పటి వరకు దుంగలు తీసుకోనందున చెట్లను యాదృచ్ఛికంగా కత్తిరించినట్లుగా భావిస్తున్నారు. ఇక గత పదమూడు నెలల్లో ట్రీ సీరియల్ కిల్లర్ 750కు పైగా ఆరోగ్యకరమైన చెట్లను నరికివేసినట్లు అంచనా వేయబడింది. ఇది వందల వేల డాలర్ల నష్టానికి సమానం. కాగా ఎవరైనా వినోదం కోసం ఈ పని చేస్తున్నారా? అనే కోణంలోనూ విచారిస్తున్నారు.

పాస్‌వర్డ్స్‌ హ్యాకింగ్‌పై పది లక్షల యూజర్లకు ఫేస్‌బుక్ హెచ్చరిక

Advertisement

Next Story