Viral : వామ్మో.. ఇదెక్కడి ఆచారం.. పెళ్లి కూతురును అమ్మకానికి తీసుకెళ్లిన పెళ్ళికొడుకు

by Prasanna |
Viral : వామ్మో.. ఇదెక్కడి ఆచారం.. పెళ్లి కూతురును అమ్మకానికి తీసుకెళ్లిన పెళ్ళికొడుకు
X

దిశ, వెబ్ డెస్క్ : సోషల్ మీడియాలో రోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో పెళ్లికి సంబంధించిన వీడియోలు ఈ మధ్య బాగా షేర్ చేస్తున్నారు. అవి, కొన్ని చూసేందుకు ఫన్నీగా ఉంటే, మరి కొన్ని షాకింగ్ గా ఉన్నాయి. అయితే, తాజాగా ఒక ఫన్నీ వీడియో వెలుగులోకి వచ్చింది. దీనిని చూసిన తర్వాత నెటిజన్లు కామెంట్లు కూడా చేస్తున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..

ప్రస్తుత కాలంలో పెళ్ళిళ్ళ కోసం లక్షలు ఖర్చు పెడుతున్నారు. వివాహంలోని ప్రతి ఘట్టాన్ని ఎంతో అద్భుతంగా జరిపించుకుంటున్నారు. ప్రతి కుటుంబం, వారి కూతురు కోసం మంచి అబ్బాయిని చూస్తారు. అయితే, అందరికీ కలిసి రాదు. ఇక్కడ వైరల్‌ అవుతున్న వీడియోలో వరుడు చేసిన పనికి షాక్ అవ్వకుండా ఉండలేరు. కొత్తగా, పెళ్లైన భార్యను అమ్మడానికి బయలుదేరాడు. రిక్షా బండిపై కొత్త పెళ్లి కూతురిని కూర్చొబెట్టుకుని మార్కెట్ కి వెళ్లినట్టు వెళ్ళాడు. ప్రస్తుతం, ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అలాగే, నెటిజన్లు కూడా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. నవవధువును అమ్మడానికి బయలుదేరాడని ఒకరు. రేటు ఎంతో చెప్పండని కొందరు.. ఇలా ఎవరికి వారు ఇష్టమొచ్చినట్టు కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed