- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రజలు ఏ వయస్సులో దేనికోసం సహాయం అడుగుతారో తెలుసా?
దిశ, ఫీచర్స్ : మనుషులన్నాక ఏదో ఒక విషయంలో సహాయం కోసం ఇతరులపై ఆధారపడక తప్పదు. వయస్సుతో సంబంధం లేకుండా ఇది అందరికీ వర్తిస్తుంది. అయితే ఏ వయస్సులో ఉన్నవారు, ఏయే అవసరాలకు ఎక్కువగా ఇతరులను సహాయం కోరుతారు? హెల్ప్ అడిగే విషయంలో ఎలా ఫీలవుతారు? ఇది తెలుసుకునే ఉద్దేశంతో వన్‌పోల్ సంస్థ తాజాగా 2000 మంది అడల్ట్స్‌పై సర్వే నిర్వహించింది. దీని ప్రకారం.. సగటను వయోజనులైనవారు తమ 27 ఏళ్ల వయస్సులో సహాయం అడగడాన్ని కంఫర్టబుల్‌గా భావిస్తున్నారు. ఇక 25 నుంచి 34 ఏండ్ల మధ్య వయస్సు గలవారు కూడా హెల్ప్ అవసరం అయినప్పుడు ఇతరులను సంప్రదించే అవకాశం ఉంది. కానీ 65 ఏండ్లు పైబడినవారు మాత్రం చాలా విషయాల్లో హెల్ప్ తీసుకోకుండా ఒంటరిగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ఇక సహాయం కోరడం ఇష్టం లేనివారు కూడా 25 శాతం మంది ఉంటుండగా.. 51 శాతం మంది స్వతంత్రంగా ఉండేందుకు ఇష్టపడుతున్నారు. 48 శాతం మంది ఇతరులకు ఇబ్బంది కలిగించవద్దనే ఉద్దేశంతో పలు సందర్భాల్లో హెల్ప్ అవసరం అయినప్పటికీ అడగడం లేదు. మరో 23 శాతం మంది కొన్ని సందర్భాల్లో హెల్ప్ అడగడాన్ని గర్వంగా ఫీలవుతున్నారు. అయితే సహాయం ఏయే అంశాల్లో కోరడానికి విముఖత చూపుతారో పరిశీలించగా.. ఆర్థిక విషయాల్లో 33 శాతం మంది, ఆరోగ్య సంబంధిత విషయాల్లో 29 శాతం మంది, రిలేషన్‌షిప్స్ విషయంలో 37 శాతం మంది ఇతరుల సలహాలు, సూచనలు అడగడాన్ని అసౌకర్యంగా భావిస్తున్నారు. కానీ వర్క్ అండ్ కెరీర్, ఎడ్యుకేషన్‌లో వంటి విషయాల్లో మాత్రం హెల్ప్ అడగడంలో ఎవరూ వెనకడుగు వేయడం లేదు. పైగా ప్రజలు ఈ విషయాల్లో సహాయం కోరడాన్ని చాలా సంతోషంగా ఫీలవుతారు. మరో 57 శాతం మంది తాము వర్కులో చేరాని తర్వాత సహాయం అడగడం తమ పురోగతికి దోహదపడిందని పేర్కొంటున్నారు.
ఏ వయస్సులో ఎంత మేలు?
పెద్దల్లో 21 శాతం మంది హెల్ప్ కోరడం సులభమని భావిస్తుండగా, చిన్న వయసులో సహాయం కోరడం చాలా సులువు అని 28 శాతం మంది భావిస్తున్నారు. ఇక 69 శాతం మంది నేర్చుకోవడానికి, ఎదగడానికి ఏ వయస్సులో సహాయం కోరినా మంచిదే అంటున్నారు. ముఖ్యంగా బిజినెస్ విషయంలో, జీవితంలోని వివిధ సందర్భాల్లో సహాయం, సలహాలు అడగడం ఎవరికైనా చాలా అవసరం. కానీ ఆచరణలో మాత్రం ఇది అంత సలువు కాదని యూకేకు చెందిన బిజినెస్ బ్యాంకింగ్ హెడ్ ప్రతినిధి సుసాన్ డేవిస్ అంటున్నారు. అయినా సహాయం కోరడంవల్లే జీవితంలో ఎదుగుదల కూడా ఉంటుందని చెప్తున్నారు.
అడగడం అంత సులువు కాదు
సహాయం అడగడం కంటే, అడగాలని సలహా ఇవ్వడం చాలా సులభమని 81 శాతం మంది భావిస్తున్నట్లు సర్వే పేర్కొన్నది. ప్రతి ఆరుగురిలో ఒకరు (16%) వర్క్ విషయంలో సహాయం అడగడానికి వెనుకా ముందు ఆలోచిస్తున్నారు. మరో 42 శాతం మంది తాము చేసే పనిని ఇతరులు చేయలేరని భావిస్తూ సహాయం కోరడం లేదట. 35 శాతం మంది తమ యజమాని లేదా కొలీగ్స్ తమ గురించి ఏమనుకుంటారోనని ఆందోళన చెందుతున్నారు. ఏది ఏమైనప్పటికీ 34 శాతం మంది వర్క్‌ప్లేస్‌లో సహాయం కోసం అడగనందుకు తర్వాత విచారం వ్యక్తం చేశారు. 24 ఏళ్లలోపు వ్యక్తులు ఈ విధంగా భావించే అవకాశం ఎక్కువగా ఉంది. ఇలా చేయడంవల్ల వర్కులో పొరపాటుకు దారితీసిందని కూడా సర్వే పేర్కొన్నది.
బిజినెస్ విషయంలో
బిజినెస్ విషయంలో సహాయం కోరడాన్ని ఎలా భావిస్తున్నారో కూడా తెలుసుకునేందుకు నిపుణులు 500 మందిని సర్వే చేశారు. అయితే ఇందులో 47 శాతం మంది తాము వ్యాపారం ప్రారంభించేందుకు సహాయం అడిగారని తేలింది. ఇక 51 శాతం మంది ప్రాక్టికల్ కోసం హెల్ప్ అడగగా, చాలా మంది స్టార్టెడ్, నెట్‌వర్కింగ్, సిబ్బందిని మేనేజ్ చేయడం, పేరోల్, లీగల్ సపోర్ట్, టాక్స్ అండ్ టెక్నాలజీ విషయంలో సహాయంతోపాటు సలహాలు, సూచనలు అడుగుతున్నట్లు సర్వేను ఎనలైజ్ చేసిన నిపుణులు చెప్తున్నారు.