మిగిలిపోయిన చపాతీలతో టేస్టీ నూడుల్స్..! ఎలా చేయాలంటే..

by Kanadam.Hamsa lekha |
మిగిలిపోయిన చపాతీలతో టేస్టీ నూడుల్స్..! ఎలా చేయాలంటే..
X

దిశ, ఫీచర్స్: కొన్ని సందర్భాల్లో ఇంట్లో చపాతీలు మిగిలిపోతుంటాయి. వాటిని వృధాగా వదిలేసే బదులు నోరూరించే టేస్టీ న్యూడుల్స్‌ని తయారు చేసుకోవచ్చు. అదెలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు:

మిగిలిపోయిన చపాతీలు

క్యారెట్, క్యాబేజీ, క్యాప్సికమ్

వెల్లుల్లి

గరంమసాలా

సోయా సాస్

నూనె

ఉప్పు

మిరియాల పొడి

తయారీ విధానం:

మిగిలిపోయిన చపాతీలను, క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజీని చిన్న చిన్న ముక్కలుగా న్యూడిల్స్ ఆకారంలో కట్ చేసుకోవాలి. తర్వాత కడాయిలో నూనె వేసి, నూనె కాగిన తర్వాత వెల్లుల్లి, కూరగాయలు వేసి వేయించుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత చపాతీ ముక్కలను వేసి కలపాలి. ఇక, చివరగా గరంమసాలా, సోయా సాస్, ఉప్పు, కొద్దిగ మిరియాల పొడి వేసి బాగా కలపుకోవాలి. చిన్న మంటమీద కొద్దిసేపు వేడి చేస్తే నోరూరించే చపాతి న్యూడిల్స్ రెడీ.

Advertisement

Next Story

Most Viewed