- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీ పిల్లలకు ఫుడ్ ఎలర్జీ ఉందా.. అయితే జాగ్రత్త ఈ వ్యాధి రావచ్చు !
దిశ, పీచర్స్ : ఆహార అలెర్జీ లక్షణాలు సాధారణంగా పిల్లలలో ఎక్కువగా కనిపిస్తాయి. అవి ఏ వయసులోనైనా కనిపిస్తాయి. కొన్నిసార్లు మీరు ఏ సమస్య లేకుండా చాలా సంవత్సరాలుగా తింటున్న వస్తువులు కూడా అప్పుడప్పుడు పడకుండా అలెర్జీ రావచ్చు. కొంతమందికి డ్రై ఫ్రూట్స్, మరికొందరికి పాల ఉత్పత్తులు తినడం వలన సమస్యలు కలుగుతాయి. చాలా మందికి చర్మ సమస్యలు మొదలవుతుంది. మొటిమల సమస్య మాత్రమే కాదు, కడుపు సంబంధిత సమస్యలు కూడా మొదలవుతాయి. ఈ పరిస్థితిని ఫుడ్ అలర్జీ అంటారు.
అయితే బాల్యంలో ఫుడ్ అలర్జీ వల్ల ఆస్తమా రావడమే కాకుండా ఊపిరితిత్తుల పనితీరు పై కూడా ప్రభావం చూపుతుందని తాజా పరిశోధనలో వెల్లడైంది. మర్డోక్ చిల్డ్రన్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన పరిశోధకులు చిన్న వయస్సులోనే ఫుడ్ అలర్జీకి గురయ్యేవారిలో ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని గుర్తించారు.
ఫుడ్ అలెర్జీ అంటే ఏమిటి ?
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆహార అలెర్జీ అనేది మన రోగనిరోధక వ్యవస్థ ప్రతిచర్య. ఇది ఏదైనా పడని ఆహారాన్ని తిన్న తర్వాత మొదలవుతుంది. ఎలర్జీకి కారణమయ్యే ఆహారాన్ని చిన్న మొత్తంలో తినడం ద్వారా కూడా, లక్షణాలు వెంటనే కనిపించడం ప్రారంభిస్తాయి.
పరిశోధన ఏం చెబుతోంది ?
ఈ పరిశోధనలో 6 సంవత్సరాల వయస్సు గల 13.7 శాతం మంది పిల్లల్లో ఆస్తమా కనుగొన్నారు. పరిశోధన ప్రకారం, ఆహార ఎలర్జీలు లేని పిల్లలతో పోలిస్తే పరిశోధనలో చేర్చబడిన పిల్లల్లో ఉబ్బసం వచ్చే ప్రమాదం దాదాపు 4 రెట్లు ఎక్కువ.
శ్వాస సంబంధిత సమస్యలు ?
దీనితో పాటు బాల్యంలో ఆహార ఎలర్జీల కారణంగా పిల్లల్లో శ్వాస సమస్యలు పెరుగుతాయి. బాల్యంలో ఊపిరితిత్తుల అభివృద్ధిలో అవరోధం కారణంగా, గుండె, శ్వాసకోశ, శరీరంలోని ఇతర భాగాలలో సమస్యలు కనిపిస్తాయి.
ఎలా రక్షించాలి
ఫుడ్ అలర్జీ వంటి సమస్యలతో బాధపడే పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లల ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వారికి సమస్యలను కలిగించే ఆహారాలను తినడం మానుకోండి.