T shirt: టీ షర్ట్‌కు ఆ పేరు ఎలా వచ్చింది?.. ఈ స్టోరీ వింటే..

by Javid Pasha |
T shirt: టీ షర్ట్‌కు ఆ పేరు ఎలా వచ్చింది?.. ఈ స్టోరీ వింటే..
X

దిశ, ఫీచర్స్ : మనం ధరించే దుస్తుల్లో రకరకాల బ్రాండ్లు, డిజైన్లు, వెరైటీలు ఉంటాయన్న విషయం తెలిసిందే. ఒక్కో దానికి ఒక్కో ప్రత్యేక కూడా ఉంటుంది. అలాంటి వాటిలో టీ షర్ట్ కూడా ఒకటి. నిజానికిది వరల్డ్ ఫేమస్ క్లాతింగ్. చూడ్డానికి అట్రాక్టివ్‌గా, వేసుకోవడానికి కంఫర్ట్‌గా ఉండటంతో పిల్లలు, పెద్దలు, మహిళలు అందరూ ఇష్టపడుతుంటారు. అయితే ప్రతి దానికీ ఓ కారణం ఉన్నట్లు, టీ షర్ట్ వెనుక కూడా ఓ హిస్టారిల్ స్టోరీ ఉందంటున్నారు ఫ్యాషన్ డిజైనర్లు. అదేంటో చూద్దాం.

అది మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న కాలం. కొత్తగా రిక్రూట్ అయిన అమెరికన్ సైనికులకు ట్రైనింగ్ పీరియడ్‌లో వేసుకోవడానికి తేలిగ్గా, కంఫర్టుగా ఉండేలా బట్టలు తయారు చేయాలని అక్కడి ప్రభుత్వం క్లాతింగ్ డిజైనర్లను ఆదేశించింది. అప్పుడు వారు తయారు చేసిన అనేక దుస్తుల్లో టీ షర్టులు కూడా ఉన్నాయి. అయితే వీటిని ట్రైనింగ్ సమయంలోనే ధరించేవారు కాబట్టి ట్రైనింగ్ షర్టులు అని పిలిచేవారు. అయితే కాల క్రమంలో ట్రైనింగ్ షర్టులను, షార్ట్ కట్‌లో ‘T shirts’ అని పిలువడం కారణంగా ఇక అదే పేరు ఫేమస్ అయిపోయింది. మరి కొందరు చూడ్డానికి T ఆకారంలో ఉంటుంది కాబట్టి ఆ పేరు వచ్చిందని కూడా చెప్తుంటారు. మొత్తానికి కంఫర్టులో బెస్ట్ కావడంవల్ల టీ షర్ట్ అంటే ఇప్పుడు అందరూ ఇష్టపడుతున్నారని ఫ్యాషన్ డిజైనర్లు చెప్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed