మీకు ఈ భాగల్లో నొప్పిగా అనిపిస్తుందా.. ఖచ్చితంగా గుండెపోటుకు సంకేతమే!

by Jakkula Samataha |
మీకు ఈ భాగల్లో నొప్పిగా అనిపిస్తుందా.. ఖచ్చితంగా గుండెపోటుకు సంకేతమే!
X

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం హార్టఎటాక్ కేసులు అనేవి విపరీతంగా పెరుగుతున్నాయి. ఏజ్‌తో సంబంధం లేకుండా చాలా మంది దీని భారిన పడి చనిపోతున్నారు. మరీ ముఖ్యం ఈ మధ్యకాలంలో 20ఏళ్లలోపు యువకులు కూడా గుండెపోటుతో మరణించారు. దీంతో వైద్యులు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసకోవాలని హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. జంక్ ఫుడ్ కాకుండా మంచి ఆహారం, పండ్లు తీసుకోవాలని చెబుతున్నారు. అయితే హార్ట్ ఎటాక్ వచ్చే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయంట. వాటిని మనం ముందే గుర్తించి వైద్యుడి వద్దకు తీసుకెళ్తే ప్రమాదం నుంచి బయటపడవచ్చు. కాగా గుండెపోటు వచ్చే ముందు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు చూద్దాం.

1. గుండె పోటు వచ్చే ముందు ఛాతిలో బిగుతుగా అనిపిస్తుంది. అంతే కాకుండా తీవ్రమైన ఒత్తడి, భుజం, మెడ, దవడ నొప్పి లాంటివి వస్తుంటాయి. అంతే కాకుండా కొంత మందికి బాడీ పెయిన్స్ కూడా ఉంటాయి. అలాగే బ్రీతింగ్ తీసుకోవడంలో సమస్యలు ఎదురు అవుతాయి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే అస్సలే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలంట.


2. పొత్తి కడుపులో నొప్పి అనేది సాధారణం. చాలా మందికి కొన్ని సందర్భాల్లో పొత్తి కడుపులో నొప్పి వస్తుంటుంది.అయితే కొన్ని సార్లు ఈ నొప్పి కూడా గుండెపోటుకు సంకేతం కావచచు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. దీని వలన నీరసం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయంట.


3. గొంతు, దవడ నొప్పి కూడా గుండెపోటుకు ముందస్తు హెచ్చరికలలో ఒకటి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ నొప్పితో పాటు పైన చెప్పిన లక్షణాలు అదే విధంగా ఎడమ భుజం నొప్పిగా అనిపించడం, బలహీనంగా మారిపోవడం వంటి సమస్యలు ఎదురవుతే తప్పకుండా నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలంట.

Advertisement

Next Story

Most Viewed