- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Sweating : ఆ సమయంలో ఒక్కసారిగా చెమటలు పడుతున్నాయా..? కారణం ఇదే!
దిశ, ఫీచర్స్ : శారీరక శ్రమ అధికమైనప్పుడో, వ్యాయామాలు చేసినప్పుడో చెమటలు పట్టడం సహజమే. దీనివల్ల ఎలాంటి ముప్పు ఉండదు. పైగా ఆరోగ్యానికి మంచిది. అలా కాకుండా ఏ పనీ చేయకుండానే రాత్రిపూట ఒక్కసారిగా విపరీతమైన చెమటలు పడితే మాత్రం అనుమానించాల్సిందే. ఎందుకంటే ఇది ఏదైనా వ్యాధి లక్షణం కావచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. సడెన్‌గా చెమలు పట్టడానికి గల కొన్ని కారణాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
*హార్మోనల్ ఇష్యూస్ : శరీరంలో హార్మోన్ల మార్పులు, అసమతుల్యత వంటివి సంభవించినా అధిక చెమటలు పడుతుంటాయని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా రాత్రిపూట పడుకున్న తర్వాత, అర్ధరాత్రిళ్లు కూడా అనుకోకుండా అధిక చెమటలతో ఇబ్బంది పడవచ్చు. ముఖ్యంగా 45 నుంచి 55 ఏండ్ల మధ్య వయస్సుగల స్త్రీలలో ఇది మెనోపాజ్ స్టేజ్ సంకేతం కూడా కావచ్చు. అలాగే థైరాయిడ్ ఎక్కువైనప్పుడు కూడా అకస్మాత్తుగా చెమటలు పడతుంటాయి.
*స్ట్రెస్ అండ్ యాంగ్జైటీస్ : ప్రతి ఒక్కరూ ఏదో ఒక కారణంగా ఒత్తిడికి గురవుతారు. అయితే అధిక ఒత్తిడికి గురికావడం వేరు. ఇది అనారోగ్య లక్షణం. స్ట్రెస్, యాంగ్జైటీస్ వంటివి కొంతకాలంగా అనుభవించే వారిలో రాత్రిళ్లు అకస్మాత్తుగా అడ్రినల్ హార్మోన్ స్థాయిలు పెరుగుతాయి. దీంతో చెమలు పడతాయి. స్ట్రెస్ రిలీఫ్ టెక్నిక్స్, జీవన శైలిలో మార్పులతో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు అంటున్నారు నిపుణులు.
*నిద్రలేమి : కొన్ని రకాల స్లీప్ డిజార్డర్స్, అలాగే నిద్రలేమి కారణంగా కూడా రాత్రిళ్లు అధిక చెమటలు పట్టే అవకాశం ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు. రాత్రంతా మేల్కోవడం శరీరంలోని జీవక్రియలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. దీంతో కొన్నిసార్లు అధిక ఆందోళనకు గురవుతారు. ఆ సమయంలో అనుకోకుండా అధిక చెమటలు పడుతుంటాయి. టెన్షన్ కారణంగా బాడీ టెంపరేచర్ మరింత పెరగడం కూడా ఇందుకు కారణం కావచ్చు.
*లో.. బ్లడ్ షుగర్ : బ్లడ్‌లో గ్లూకోజ్ లెవల్స్ భారీగా తగ్గినప్పుడు కూడా అధిక చెమలు పడతాయి. ఈ పరిస్థితిని హైపోగ్లైసేమియా అంటారు. చక్కెరస్థాయిలు పడిపోవడం, అడ్రినలిన్ హార్మోన్ అధికంగా రిలీజ్ అవడం ఒక్కసారిగా జరగడంతో రాత్రిపూట ఈ సమస్య ఎక్కువగా ఎదురవుతూ ఉండవచ్చు. కాబట్టి అకస్మాత్తుగా అధిక చెమటలు పట్టే సమస్యను ఎదుర్కొనే వారు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వైద్య నిపుణులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం ఉత్తమం.
*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ బాధ్యత వహించదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.