- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Sun bath therapy : సన్ బాత్ థెరపీ అంటే ఏమిటి..? దీనితో కలిగే ప్రయోజనాలు
దిశ, ఫీచర్స్: మారుతున్న కాలానుగుణంగా మనిషి జీవిత కాలం కూడా తగ్గుతుంది. తీసుకొనే అనారోగ్యకరమైన ఫుడ్‌ని బట్టి అతి చిన్న వయస్సులోనే అనేక వ్యాధుల బారిన పడి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. రోజంతా ఇంట్లోనే, ఏసీలో ఉంటూ సేద తీరుతున్నారు. కనీసం గంట కూడా సూర్యరశ్మిలో ఉండట్లేదు. సూర్యకాంతి నుంచి విడుదల అయ్యే విటమిన్ డి శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని విషయం తెలిసిందే. అయితే చాలామందికి సన్ బాత్ గురించి పెద్దగా తెలియదు. రోజూ కాకపోయినా అప్పుడప్పుడు సన్ బాత్ చేస్తుంటే ఎంతో ఆరోగ్యంగా ఉంటామని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఈ సన్ బాత్ అంటే ఏంటి? అసలు ఏ సమయంలో ఈ సన్ బాత్ చేయాలి? ఎంత టైమ్ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
1) సన్ బాత్ అంటే ఏమిటి, దాని ప్రయోగాలు:
సూర్యకాంతిలో కొంత సమయం ఉండటాన్నే సన్ బాత్ అంటారు. రోజూ ఈ బాత్‌ను చేయడం వల్ల ఆరోగ్యానికి బోలెడన్నీ ప్రయోజనాలు ఉన్నాయి. సూర్యకాంతి నుంచి వెలువడే విటమిన్ డి మనకి తాకినప్పుడు బాడీ యాక్టివ్‌గా ఉంటుంది. ఈ సూర్యకాంతి నుంచి వచ్చే విటమిన్ డి కాల్షియంను గ్రహించడంలో సాయపడుతుంది. కాల్షియం ఎముకలను దృఢంగా ఉండేలా సాయపడుతుంది.
అలాగే ఎముకల సాంద్రతను పెంచడంతో పాటు ఎముక పగుళ్ల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. బోలు ఎముకల వ్యాధి, రికెట్స్ వంటివి రాకుండా కాపాడుతుంది. అలాగే అధిక రక్తపోటును తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
2) సన్ బాత్‌కి ఎంత సమయం వెచ్చించాలి:
సాధారణంగా ఈ సన్ బాత్‌ను రోజుకి 15 నుంచి 30 నిమిషాలు చేస్తే సరిపోతుంది. ఇలా రోజూ చేయడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరానికి తగినంత విటమిన్ డి అందడం వల్ల ఎలాంటి సమస్యలు రావు. వచ్చిన తట్టుకునే సామర్థ్యం సన్ బాత్ కల్పిస్తుంది. అయితే ఈ సన్ బాత్‌ను ఒక లిమిట్‌లో మాత్రమే చేయాలి. అంతకంటే ఎక్కువగా చేస్తే అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. అయితే చాలా మందికి డైలీ చేసే సమయం లేనప్పుడు వారానికి ఒక్కసారి చేసిన మంచి ప్రయోజనం ఉంటుంది.
3) అధిక సమయం వెచ్చిస్తే కలిగే నష్టాలు:
సన్ బాత్‌ను ఎక్కువ సేపు చేయకూడదు. ఎవరైనా గంట కంటే ఎక్కువగా సూర్యకాంతిలో ఉంటే శరీరంలో విటమిన్ డి ఉత్పత్తి చేసే సామర్థ్యం గరిష్ట స్థాయికి వెళ్తుంది. దీనివల్ల మీరు సూర్యరశ్మి తీసుకున్న ప్రయోజనం ఉండదు. గంట కంటే ఎక్కువ సమయం ఉంటే చర్మానికి హాని కలుగుతుంది. కొన్నిసార్లు చర్మ క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదముంది. అయితే సన్ బాత్‌ను వేసవిలో చేయకపోవడం మంచిది. ఈ సన్ బాత్‌ను చేస్తే చాలు ఆరోగ్యం బాగుంటుందని అనుకోవద్దు. దీనితో పాటు మంచి ఆహారం కూడా తీసుకోవాలి. అలాగే సన్ బాత్ వల్ల బద్ధకం పోతుంది. అలసట నుంచి ఉపశమనం లభిస్తుంది. నిద్ర కూడా మంచిగా పడుతుంది. ఆందోళన, ఒత్తిడి తగ్గి రోజంతా చాలా యాక్టివ్‌గా ఉంటారు. శారీరక ఆరోగ్యం కుదుటపడటంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా బాగా మెరుగుపడుతుంది. కాబట్టి రోజుకు కనీసం పది నిమిషాలైన సన్ బాత్ చేస్తే మంచి ఫలితాలుంటాయి.
4) సన్ బాత్‌కు ముందు, తర్వాత చేయాల్సిన పనులు:
*సన్ బాత్ చేసే ముందు ఎక్కువగా వాటర్ తీసుకొని బాడీని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి.
*అలాగే ఈ బాత్ చేసే ముందు తడి టవల్‌తో మీ తలను చుట్టుకొని మొత్తం కవర్ చేసుకోవాలి.
*సన్ బాత్ అయిన వెంటనే నీటితో స్నానం చేయాలి.
*అలాగే సన్ బాత్ చేసిన తర్వాత వెంటనే ఎటువంటి ఆహార పదార్థాలు గాని తీసుకోవద్దు. కనీసం ఒక గంట వరకైన కచ్చితంగా ఆగాల్సిందే.
*అదే విధంగా సన్ బాత్‌కి 2 గంటల ముందునుంచే ఎటువంటి ఫుడ్ తీసుకోవద్దు.
*చివరిగా గుండె జబ్బులతో బాధపడుతున్న వ్యక్తులు లేదా లైట్‌కు అలెర్జీ ఉన్నవారు దీనికి దూరంగా ఉండటం మంచిది.
నోట్: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే దీనిని అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు సంబంధించి ‘దిశ’ ఎటువంటి బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించడం ఉత్తమం.