Success: ఈ లక్షణాలు మీలో ఉన్నాయా..? డోంట్ వర్రీ.. జీవితంలో సక్సెస్ అయినట్టే!

by Javid Pasha |
Success: ఈ లక్షణాలు మీలో ఉన్నాయా..? డోంట్ వర్రీ.. జీవితంలో సక్సెస్ అయినట్టే!
X

దిశ, ఫీచర్స్ : అనుకున్నది సాధించాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అందరూ సక్సెస్ కాలేకపోతారు. ఎందుకంటే ఏదైనా అనుకున్నంత ఈజీ కాదంటుంటున్నారు నిపుణులు. ఆలోచన, ఆసక్తి, లక్ష్యంతో పాటు అందుకు తగిన వనరులు, పరిస్థితులు కూడా అనుకూలించాలి. దీనికితోడు కష్టపడే మనస్తత్వం, ఓపిక, సహనం, అవగాహన ఉండాలి. సక్సెస్‌ఫుల్ పీపుల్ జీవితాలను పరిశీలించినా అదే అర్థం అవుతుంది. వారంతా ఎన్నో ఆటంకాలను అధిగమించి, కష్టాలకు ఓర్చి సక్సెస్ సాధించినవారేనని నిపుణులు చెప్తుంటారు. అలాంటి వ్యక్తుల జాబితాలో మీరు కూడా చేరాలంటే కష్టాలను స్వీకరిస్తూనే.. సక్సెస్ కోసం ప్రయత్నించాలని సూచిస్తున్నారు. అందుకు ఉపయోగపడే కొన్ని ప్రాథమిక లక్షణాలను అలవర్చుకోవాలని చెప్తున్నారు. అవేంటో చూద్దాం.

* ఉదయం త్వరగా నిద్ర లేవడం : సక్సెస్ సాధించాలనుకునే వారు టైమ్ మేనేజ్‌మెంట్ స్టిక్ట్‌గా ఫాలో కావాలంటారు నిపుణులు. అంతేకాకుండా సక్సెస్ పీపుల్ రోజువారీ అలవాట్లను గమనిస్తే.. వారు ఎల్లప్పుడూ ఉదయం 5 గంటలలోపు నిద్రలేచే హాబిట్స్ కలిగి ఉంటున్నట్లు పలు అధ్యయనాల్లో వెల్లడైంది. కాబట్టి మీరు కూడా దీనిని అలవర్చుకోవడం మంచిదని సూచిస్తున్నారు. ఎందుకంటే ఉదయంపూట లేవడం అనేది ఆ రోజును ఉత్సాహంగా ప్రారంభించడంలో, ఆరోగ్య పరమైన జీవక్రియలను ప్రేరేపించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

* పుస్తకాలు చదవడం : ఏ రంగంలో చూసినా సక్సెస్ సాధించిన వారు, గొప్ప లక్ష్యాల కోసం ప్రయత్నించే వారికి ఉండే సాధారణ అలవాట్లలో ఒకటి పుస్తకాలు చదవడం. ఇది మానసిక వికాసానికి, భాషా పరిజ్ఞానానికి, సామాజిక స్పృహకు చాలా ముఖ్యం అంటున్నారు నిపుణుల. చరిత్ర, సైన్స్, మోటివేషనల్.. ఇలా రకరకాల పుస్తకాలు చదవగలిగితే సక్సెస్ సాధించే మార్గం మరింత ఈజీగా తెలిసిపోతుందని చెప్తారు. ఎందుకంటే పుస్తకాలు మిమ్మల్ని మార్చేస్తాయ్.

* ఆరోగ్యం పట్ల శ్రద్ధ : ఏ ప్రయత్నం చేయాలన్నా ముందు మీరు హెల్తీగా ఉండాలి. అలా లేనప్పుడు ఆ ప్రయత్నాలన్నీ విఫలం అవుతుంటాయి. కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకునే ఆహారపు అలవాట్లను, జీవనశైలిని అలవర్చుకోవాలంటున్నారు నిపుణులు. రోజూ వ్యాయామాలు, సరైన నిద్ర, సమయం ప్రకారం పనులు చేయడం ఆరోగ్యకరమైన జీవితంలో అంతర్భాగమే.

* సానుకూల దృక్పథం : ఒక విషయంపట్ల ప్రతికూల దృక్పథాన్ని కలిగి ఉంటే అందులో ప్రతికూలతలే ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుందని, సానుకూల దృక్పథం కలిగి ఉంటే సానుకూలతలే అధికంగా కనిపిస్తాయని నిపుణులు అంటుంటారు. కాబట్టి సరైన ఆధారాలు లేకుండా, అనుభవంలోకి రాకుండా ఏ విషయంపట్ల కూడా మీరు ప్రతికూల దృక్పథాన్ని ఏర్పర్చుకోవద్దని చెప్తారు. విజయం సాధించాలంటే అది ఎంత కష్టమైనా సరే ముందుగా పాజిటివ్‌గా ఆలోచించడం నేర్చుకోవాలి. సానుకూల ఆలోచన రావడమే వాస్తవానికి సగం సక్సెస్‌తో సమానమని నిపుణులు చెప్తున్నారు. కాబట్టి సక్సెస్ సాధించాలనుకుంటే నెగెటివ్ థింకింగ్స్‌కు అవకాశం ఇవ్వకూడదు.

*అనవసర వాదనలు వద్దు : ముఖ్యమైన లక్ష్యాలు సాధించే క్రమంలో ఆరోగ్యకరమైన సంభాషణ, వాదన వంటివి ఉపయోగమే. కానీ ప్రతీ చిన్న విషయానికి వాదనకు దిగడం, ఎదుటి వ్యక్తులతో తగాదా పడటం వంటి అలవాట్లు మీ సక్సెస్ అవకాశాలను అడ్డుకుంటాయని నిపుణులు చెప్తున్నారు. అవసరంలేని విషయాల్లో వాదనకు దిగితే సమయం వృథా అవుతుంది. పైగా చికాకు, ఆందోళన వంటివి ఏర్పడే చాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు ఏ విషయంలో విజయం సాధించాలని భావిస్తారో ఎక్కువగా దానిపైనే దృష్టి పెట్టాలి. అందుకు అవసరమైన అంశాలకు, ఆరోగ్యకరమైన వాదనలకే ప్రయారిటీ ఇవ్వాలి. అంతే తప్ప సమయం, సందర్భంలేని వాదనలతో ఉపయోగడం ఉండదని నిపుణులు అంటున్నారు. కాబట్టి ఈ లక్షణాలన్నీ మీలో ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. లేకపోతే అలవర్చుకోండి. అప్పుడు సక్సెస్‌ వైపు దూసుకెళ్లడం మరింత సులువవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed