MARS : అంగారకుడిపై సముద్రాలను సృష్టించేంత భారీ మొత్తంలో నీరు..

by Sujitha Rachapalli |
MARS : అంగారకుడిపై సముద్రాలను సృష్టించేంత భారీ మొత్తంలో నీరు..
X

దిశ, ఫీచర్స్ :అంగారక గ్రహంపై విస్తారమైన భూగర్భ జలాశయాన్ని గుర్తించారు పరిశోధకులు. నాసాకు చెందిన ఇన్ సైట్ మిషన్ డేటా ఆధారంగా ఈ అద్భుతాన్ని కనుగొన్న శాస్త్రజ్ఞులు.. ఈ నీరు మహాసముద్రాలను సృష్టించగలదని చెప్తున్నారు. నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రొసీడింగ్స్‌లో ప్రచురించబడిన అధ్యయనం.. మార్స్ క్రస్ట్‌లోని చిన్న పగుళ్లు, రంధ్రాలలో చిక్కుకున్న నీరు గ్రహాన్ని 1.6 కిలోమీటర్లు లోతు వరకు కవర్ చేయగలదని వెల్లడించింది. కాగా ఇన్‌సైట్ మిషన్ 2018 నుంచి 2022 వరకు దీనిపై పనిచేసింది. మార్స్ లోపలి భాగాన్ని పరిశీలించడానికి సీస్మోమీటర్‌ను ఉపయోగించింది.

ఈ డేటా రిజర్వాయర్ మార్టిన్ సర్ఫేస్ కింద 7 నుంచి 12 మైళ్ల (11.5 మరియు 20 కిలోమీటర్లు) మధ్య ఉందని సూచిస్తుంది. కాగా ఈ ఆవిష్కరణ అంగారకుడి భౌగోళిక చరిత్రపై లోతైన అవగాహనను అందిస్తుంది. కొత్తగా అన్వేషించేందుకు మరిన్ని అవకాశాలకు దారితీస్తుంది. భవిష్యత్ లో ఈ నీటిని యాక్సెస్ చేయగలిగితే... ఆ గ్రహం గత వాతావరణం గురించి, అక్కడ జీవితానికి మద్దతు ఇవ్వగల సామర్థ్యంపై కీలక వివరాలను తెలుసుకోవచ్చని అంటున్నారు పరిశోధకులు. అయితే ఈ నీటిని యాక్సెస్ చేయడంలో అనేక సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంగారక గ్రహంపై అంత లోతుకు డ్రిల్లింగ్ చేయడానికి గణనీయమైన వనరులు, అధునాతన సాంకేతికత అవసరం.

Advertisement

Next Story