- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Stress Free Techniques : ఒత్తిడి వెంటాడుతోందా..? బయటపడే సింపుల్ టెక్నిక్స్ ఇవిగో!
దిశ, ఫీచర్స్ : ఉరుకులూ పరుగుల జీవితంలో రకరకాల ఒత్తిళ్లు వెంటాడుతుంటాయి. నిజానికి స్ట్రెస్ కూడా మనిషికి అవసరమైన ఒక కోపింగ్ మెకానిజమే.. కానీ మరీ ఎక్కువైనప్పుడు అది తిరగబడుతుంది. ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అందుకే మీరు దానిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలంటారు నిపుణులు. మగవారితో పోలిస్తే మహిళల్లో స్ట్రెస్ రిలీటెడ్ ఇష్యూస్ ఇటీవల అధికం అవుతున్నాయని నిపుణులు చెప్తున్నారు. అయితే స్ట్రెస్‌ను తగ్గించుకోవడానికి చేయాల్సిన కొన్ని పనులు గురించి తెలుసుకుందాం.
* ప్రాబ్లం చిన్నదైనా, పెద్దదైనా ముందుగా ఎదురయ్యే సమస్య నిద్రలేమి. ఎందుకంటే కొందరు సమస్య చిన్నదైనా అతిగా ఆలోచిస్తుంటారు. దీంతో బాడీలో మెలటోనిన్ ఉత్పత్తి తగ్గుతుంది. రాత్రిళ్లు కంటిమీద కునుకు లేకుండా పోతుంది. ఏకాగ్రత దెబ్బతినడం, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం వంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ధ్యానం, యోగా, మెడిటేషన్, హెర్బల్ మసాజ్ థెరపీ వంటివి మీలో రిలాక్సేషన్ కలిగిస్తాయి. ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు.
* మీరు ఎక్కువగా స్ట్రెస్‌కు గురవుతుంటే గనుక కొంతకాలం చక్కెర, కాఫీ, టీ, కూల్ డ్రింక్స్, జంక్ ఫుడ్స్ వంటివి తీసుకోవడం తగ్గించాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే వీటివల్ల మీలో ఆందోళన మరింత పెరుగుతుంది. అధిక బరువుకు కారణం అవుతుంది. అవకాడో, చిక్కుళ్లు, గుమ్మడి గింజలు, అరటి పండు వంటివి ఆహారంలో భాగం చేసుకోవడంవల్ల వీటిలోని మెగ్నీషియం, పొటాషియం స్థాయిలు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి.
* ఒత్తిడిని ఎదుర్కొంటున్నప్పుడు మీ ప్రియమైన వారితో మాట్లాడటం, బాధలు, సమస్యలు పంచుకోవడం వల్ల కొంత రిలాక్స్ అవుతారు. అయితే మీ సమస్యను విని అర్థం చేసుకునే వారితో మాత్రమే విషయాలు షేర్ చేసుకోండి. అలా కాకుండా ప్రతికూలతను పెంచే వ్యక్తులైతే మరింత ఒత్తిడి, నిరాశ, నిస్పృహ పెరిగిపోవచ్చు. దీంతోపాటు మీలో ఉత్సాహం కలిగించే పనులు చేయడం, ప్రకృతిని ఆస్వాదించడం, బుక్స్ చదవడం వంటివి కూడా ఉపశమనం కలిగిస్తాయి.
* నోట్: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.