ఆ ఊర్లో మహిళలంతా నగ్నంగానే.. 5 రోజులపాటు మగాళ్లంతా అలా చేయాల్సిందే..

by Sumithra |   ( Updated:2023-03-12 17:15:10.0  )
ఆ ఊర్లో మహిళలంతా నగ్నంగానే.. 5 రోజులపాటు మగాళ్లంతా అలా చేయాల్సిందే..
X

దిశ, వెబ్ డెస్క్ : మన దేశంలోని ఏ రాష్ట్రంలో ఐనా స్త్రీలు నిండుగా దుస్తులు ధరించడం చూస్తూ ఉంటాం. అదే విదేశాల్లో అయితే కాస్త మోడ్రన్ డ్రెస్సులు, బికినీలు లాంటివి ధరిస్తారు. కానీ మనదేశంలో ఉండే ఒక రాష్ట్రంలోని ఓ గ్రామంలో స్త్రీలు అస్సలు వస్త్రాలు ధరించరంట. మొగుడు పెళ్లాలు అస్సలు మాట్లాడుకోరట. కనీసం ఒకరిని చూసి ఒకరు నవ్వుకోరంట. అది అక్కడి ఆచారమట. వింటుంటే ఇదేంటి ఇంత వింత ఆచారాలు మన దేశంలో ఉన్నాయా అనుకుంటున్నారా. ఇంతకీ ఇంతటి వింతవింత ఆచారాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి. ఆ ఆచారాల వెనక ఉన్న కథ ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం..

మ‌న‌దేశంలోని హిమాచ‌ల్‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని, కులు జిల్లా పిని గ్రామంలో ఓ వింత ఆచారం అమలులో ఉంది. అయితే ఈ ఆచారం ఏడాది మొత్తం కాకుండా సంవత్సరంలో 5 రోజులు మాత్రమే పాటించాలని అక్కడి పూర్వీకులు చెపుతున్నారు. ఈ ఆచారం పాటించడానిక స్త్రీలకు, పురుషులకు వేర్వురు నియమాలు ఉన్నాయట. ఆ ఆచారాలను ఆ పిని గ్రామప్రజలు ఖచ్చితంగా పాటించాలని, లేదంటే ఆ గ్రామానికి చెడు జరుగుతుందని అక్కడివారి నమ్మకం. ఇక చేసేదేమీ లేక వారు ఏండ్ల కాలం నాటి ఆచారాలను పాటిస్తున్నారు.

స్త్రీలు పాటించాల్సిన నియ‌మాలు..

పిని గ్రామంలోని స్త్రీలు ప్రతి ఏడాది శ్రావ‌ణ మాసంలో ఐదు రోజుల పాటు ఆచారాన్ని పాటించాలని అక్కడి పెద్దలు చెబుతున్నారు. ఆ సమయంలో ఒంటిపైన నూలు పోగు కూడా లేకుండా ఉండాలట. ఇంటి బయటికి రాకుండా ఇంట్లో ఉండే అన్నిపనులు బ‌ట్ట‌లు లేకుండానే చేస్తారు. ఇంట్లో ఉండే తన భర్తను కన్నెత్తి చూడకూడదు, చూసినా నవ్వడం, మాట్లాడడం లాంటివి చేయకూడదు. అలా పాటించకపోతే వారి కుటుంబానికి, ఆ గ్రామానికి తీవ్ర నష్టం జరుగుతుందని వారి నమ్మకం.

పురుషులు పాటించాల్సిన నియ‌మాలు..

ఇక పురుషుల విషయాకొస్తే భార్యాభర్తుల ఒకే ఇంట్లో ఉన్నా సంబంధం లేకుండా ఉండాల‌ట‌. తమ భార్యలు తన ఎదురుగా ఉన్నాసరే అస్సలు మాట్లాడకూడదు. వారిని చూసి న‌వ్వ‌కూడ‌ద‌ట‌. మద్యం సేవించడం, మాంసం తినిడం ఆ ఐదు రోజులు నిషేధిస్తారు. ఎంత క‌ష్ట‌మైనా ఇష్టంగా ఈ ఆచారాన్ని పాటించాలని చెబుతుంటారు.

ఈ సంప్ర‌దాయం ఎలా వచ్చింది..

ఈ ఆచారం గురించి పూర్వీకులు ఏం చెప్పారంటే... ఒకానొక సమయంలో పిని గ్రామంలో రాక్ష‌సులు తిరుగుతూ ఉండేవారట. అయితే ఆ రాక్షసులు మనుషులను ఎత్తుకెల్లకుండా ఎప్పుడూ గ్రామంలోని మ‌హిళ‌ల దుస్తుల‌ను చింపి, తీసుకెళ్లేవని చెబుతుంటారు. దాని పోరును భరించలేని గ్రామస్తులు ల‌హువా ఘోండ్ అనే దేవ‌తను కొలిచారట. దాంతో భాద్ర‌ప‌ద మాసం తొలి రోజు ఆ దేవత గ్రామ‌స్తుల‌ను కాపాడేందుకు గ్రామానికి వ‌చ్చిందట. ఆ తరువాత రాక్ష‌సునితో తలపడి సంహ‌రించింద‌ట‌. అప్పటి నుంచి గ్రామస్తులకు రాక్ష‌సుని బాధ తప్పిందట. అప్పటి నుంచి ప్రతి ఏడాది శ్రావ‌ణమాసంలో 5 రోజులు స్త్రీలు దుస్తులు ధ‌రించ‌కూడ‌దు అనే ఆచారం మొదలైందని చెబుతారు. ఆ ఐదురోజులు స్తీలు దుస్తులు ధరించి క‌నిపిస్తే రాక్ష‌సులు వ‌చ్చి ఎత్తుకుపోతార‌ని ప్ర‌జ‌ల నమ్మకం. అయితే ఆ ఐదురోజుల పాటు బ‌య‌ట వ్య‌క్తులు ఎవరూ కూడా గ్రామంలోకి రావ‌డం నిషిద్ధ‌ించారట.

ఒకప్పుడు ఎంతో నిష్టగా ఈ ఆచారాన్ని పాటించేవారట. కానీ ఇప్పుడున్న కాలంలో నేటి యువత ఈ సంప్ర‌దాయాన్ని పెద్ద‌గా ఆచ‌రించ‌డం లేద‌ట‌. ఒకవేల ఆచరించినా స్త్రీలు సన్నటి చున్నీ లాంటివి క‌ప్పుకుంటున్నారు. అయితే పెద్దవారు మాత్రం ఖచ్చితంగా సాంప్రదాయాన్ని పాటిస్తున్నార‌ట‌.

ఇవి కూడా చదవండి :


గుడ్ రిలేషన్‌షిప్ కోసం ఇలా చేయండి

ఔషధ గుణాల గని సపోటా..!

Advertisement

Next Story