Stomach Flu: ఏది పడితే అది తింటున్నారా?

by Prasanna |   ( Updated:2023-04-14 11:02:56.0  )
Stomach Flu: ఏది పడితే అది తింటున్నారా?
X

దిశ, వెబ్ డెస్క్ : వేసవికాలం వచ్చిన తర్వాత ఈ స్టమక్ ఫ్లూ కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయని అధికారులు తెలిపారు. కడుపు సమస్యలతో ఆసుపత్రులకు వస్తున్న వారి సంఖ్య 15 శాతం పెరిగిందని వైద్యులు వెల్లడించారు. దీనికి కారణం బయట ఏది పడితే అది తినడం, కలుషిత ఆహారాలు తినడం వల్ల పొట్ట అసౌకర్యంగా అనిపించడం, వికారం, వాంతులు లాంటి సమస్యలు వస్తాయి. అయితే ఈ లక్షణాలు కనిపించినప్పుడు అది పొట్ట ఇన్ఫెక్షన్ కూడా కావొచ్చు. స్టమక్ ఫ్లూ వ్యాధికి గురైనప్పుడు 48 గంటల్లోపు వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వ్యాధి వస్తే రెండు నుంచి మూడు రోజుల వరకు ఉంటుందట. స్టమక్ ఫ్లూ వ్యాధి వచ్చినప్పుడు వికారం, వాంతులు, డయేరియా, కడుపు తిమ్మిరి, కడుపు నొప్పి, ఆకలి లేకపోవడం లక్షణాలు కనిపిస్తాయి.

ఇవి కూడా చదవండి: Mushroom: పుట్టగొడుగులు అధికంగా తింటే ఈ ఆరోగ్య సమస్యలు తప్పవట?

Advertisement

Next Story