Dangerous sex : శృంగారానికి ఎక్కువ రోజులు దూరంగా ఉంటున్నారా..? అయితే డేంజర్‌లో పడ్డట్టే..!

by sudharani |   ( Updated:2023-09-02 16:18:54.0  )
Dangerous sex : శృంగారానికి ఎక్కువ రోజులు దూరంగా ఉంటున్నారా..? అయితే డేంజర్‌లో పడ్డట్టే..!
X

దిశ, వెబ్‌డెస్క్: శృంగారం గురించి బహిరంగంగా మాట్లాడాలంటేనే సిగ్గుపడిపోతారు నేటి యువత. కానీ సెక్స్ చేయడానికి మాత్రం ముందుంటారు. అయితే యువతలో ఎంత ఎక్కువ సెక్స్ కోరికలు ఉంటాయో.. అంతే మొత్తంలో దానిపై అనుమానాలూ ఉంటాయి. ఆ అనుమానాలను కూడా నివృత్తి చేసుకోవడానికి సిగ్గుపడిపోతుంటారు. ప్రస్తుతం యువత సంగతి ఎలా ఉన్నా.. పెళ్లైన జంటల్లోనూ ఇదే పరిస్థితి ఉందని సెక్సాలాజిస్టులు చెబుతున్నారు. ముఖ్యంగా దంపతులు రోజుల తరబడి శృంగారానికి దూరంగా ఉంటే ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు. అవేంటో తెలుసుకుందాం..

ఎక్స్‌లెంట్ రిలేషన్ షిప్

రోజూ శృంగారం చేసే వ్యక్తి శరీరంలో రోగనిరోధక శక్తి అధికంగా పెరుగుతుంది. ఇది వ్యాధులు రాకుండా అరికడుతుంది. అలాగే శరీర ఇమ్యునోగ్లోబులిన్ కెమిస్ట్రీ నిరంతరం పెరుగుతుంది. ఒత్తిడిని దూరం చేస్తుంది. దంపతులు మధ్య ప్రేమ, ఆప్యాయత పెరుగుతుంది. మానసికంగా ఇద్దరు చాలా దగ్గర అవుతారు. శృంగారం సమయంలో ఇద్దరి మధ్య ఆరోగ్యకమైన సంబంధాలు ఏర్పడి రిలేషన్ షిప్ పెరుగుతుంది.

ఒత్తిడి పెరుగుతుంది

రోజూ శృంగారం చేసుకోవడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్, ఆక్సిటోసిన్ హార్మోన్లు విడుదలవుతాయి. ఈ న్యూరోకెమికల్స్ ఒత్తిడిని తగ్గిస్తాయి. క్రమం తప్పకుండా సెక్స్ చేయకపోతే, శరీరంలోని ఈ హార్మోన్లను తక్కువగా ఉత్పత్తి అయ్యి ఒత్తిడిని ఎదుర్కోవడంలో విఫలం అవుతారు. ఫలితంగా, మీ ఒత్తిడి స్థాయిలు పెరిగే అవకాశం ఉంది.

చర్మంపైనా తీవ్ర ప్రభావం

నిత్యం సెక్స్ చేసే వాళ్ల చర్మం మెరిసేలా ఉంటుంది. సెక్స్ తర్వాత శరీరంలో డోపమైన్ హార్మోన్ పెరిగి చర్మాన్ని స్పష్టంగా మెరిసేలా చేస్తుంది. మీకు శారీరక సంబంధాలు లేకుంటే ఆ ప్రభావం మీ చర్మంపై కూడా కనిపిస్తుందని ఓ అధ్యయనం వెల్లడించింది.

ఇవి కూడా చదవండి : దారితప్పుతున్న రొమాన్స్.. స్పానిష్ పీపుల్ ఆలోచనే వేరట !

Advertisement

Next Story