- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టూత్ బ్రష్ ఎక్కడ పుట్టిందో తెలుసా..? జైలులో
దిశ, వెబ్ డెస్క్: చాలామంది టూత్ బ్రష్ నే వాడుతుంటారు. కొంతమంది మాత్రమే రెగ్యులర్ గా వేప పుల్లను వాడుతుంటారు. అయితే, వేప పుల్లతో పళ్లు తోముకునేవారికి సమస్యలేదు. కానీ, టూత్ బ్రష్ కావాలనుకునేవారికి మాత్రమే పెద్ద సమస్య ఉంటదంటా. అదేంటంటే ఏ రకం టూత్ బ్రష్ ను ఎంచుకోవాలనేది వారి సమస్య అంటా! అయితే, పిల్లల కోసం, ప్రత్యేకించి స్త్రీ, పురుషుల కోసం ఎన్నో రకాల టూత్ బ్రష్ లు ఈనాడు వాడుకలోకి వచ్చాయి. అయితే, టూత్ బ్రష్ పుట్టింది మాత్రం జైలులో. వినడానికి ఆశ్చర్యకరంగా ఉన్న ఇది నిజం.
1770లో విలియం ఆడీస్ అనే ఒక వ్యక్తిని ఇంగ్లాండులో అల్లర్లు లేవదీస్తున్నందుకు జైల్లో పెట్టారు. అతను నిజానికి చాలా తెలివైనవాడు. అలవాటు ప్రకారం ఒక ఉదయాన గుడ్డతో పళ్లు తోముకుంటుంటే అతనికొక ఆలోచన వచ్చింది. ఆ తరువాత భోజనం పళ్లెంలో నుంచి ఒక ఎముక ముక్కను ఏరుకుని వచ్చి దానికి చిన్న చిన్న రంధ్రాలు చేశాడు. సెంట్రీ సహాయంతో కొన్ని గట్టి వెంట్రుకల్లాంటివి సంపాదించి అందులో బిగించి పళ్లు తోముకున్నాడు. అదే ప్రపంచంలోని తొలి టూత్ బ్రష్. జైల్లోంచి బయటకు వచ్చిన తరువాత అతను బ్రష్ లను తయారు చేసి అమ్మడం మొదలుపెట్టాడంటా. అప్పటి నుంచి టూత్ బ్రష్ లు ఫేమస్ అయ్యాయి. అయితే, అతను అప్పటి నుంచి మళ్లీ జైలుకు పోవలసిన అవసరం రాలేదంటా.
Also read: పెళ్లి చేసుకునే అమ్మాయిలకు లక్కీ ఛాన్స్.. ఏమిటంటే?
- Tags
- Toothbrush