అక్కడ పురుషులను బాయ్ కాట్ చేస్తున్న స్త్రీలు.. శృంగారం, పిల్లలు అస్సలు వద్దు అంటూ ఉద్యమం

by Sujitha Rachapalli |
అక్కడ పురుషులను బాయ్ కాట్ చేస్తున్న స్త్రీలు.. శృంగారం, పిల్లలు అస్సలు వద్దు అంటూ ఉద్యమం
X

దిశ, ఫీచర్స్: పితృస్వామ్య వ్యవస్థ, సంప్రదాయాల ముసుగు, మూఢ నమ్మకాలు స్త్రీల స్వేచ్ఛను తరతరాలుగా హరిస్తున్నాయి. ఇన్నాళ్లు నాలుగు గోడలకే పరిమితం అయ్యేలా చేశాయి. మహిళ అంటే కేవలం భర్తతో శృంగారం కోసం ఆడుకునే ఆట వస్తువులా, మొగుడు చెప్పినట్లు వినే మూగ బొమ్మగా, పిల్లలను కని పెంచే యంత్రంగా, పనులు చేసి పెట్టే రోబో మాదిరిగా ట్రీట్ చేయబడింది. కానీ ప్రస్తుతం పరిస్థితుల్లో మార్పు వస్తుంది. ఆడవాళ్లు తమ కాళ్ల మీద తాము నిలబడేందుకు బయటకు వస్తున్నారు. మగవారితో సమానమైన పోటీ ఇస్తున్నారు. ఇందుకోసం పట్టుదలతో కృషి చేస్తున్నారు.

ఈ క్రమంలోనే సౌత్ కొరియన్ ఉమెన్ చేస్తున్న ఉద్యమం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్త్రీలను ఆలోచింప చేస్తుంది. 4B మూవ్మెంట్ పై సోషల్ మీడియాలోనూ చర్చ జరుగుతుంది.

1. Biseksue - No Sex With Men(పురుషులతో శృంగారం వద్దు)

2. Bichulsan - No Chil Rearing(పిల్లల్ని కనొద్దు)

3. Biyeonae - No Dating Men(మగాళ్లతో డేటింగ్ వద్దు)

4. Bihon - No Marriage With Men(పురుషులతో పెళ్లి వద్దు)

పురుషులతో డేటింగ్, శృంగారం, పెళ్లి, పిల్లలను కనడాన్ని పూర్తిగా బాయ్ కాట్ చేయడం ఈ ఉద్యమం ఉద్దేశం. 2019లో ట్విట్టర్ లో ఈ మూవ్మెంట్ మొదలు కాగా ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా రీచ్ అయింది. Kim Jiyoung అనే నవలలో 2016లో ఈ పదం ఇంట్రడ్యూస్ అవగా.. ట్రెడిషనల్ జెండర్ రోల్స్ కు వ్యతిరేకంగా ఉండటమే అసలైన పోరాటం. అయితే ప్రజెంట్ దీనిపై నెట్టింట భారీ ఎత్తున చర్చ జరుగుతుంది.

4B మూవ్మెంట్ ఒంటరిగా ఉంటేనే సంతోషంగా ఉండొచ్చని నొక్కి చెప్తుంది. కాబట్టి ఈ రోజుల్లో అమ్మాయిలకు ఇది కచ్చితంగా అవసరమని అభిప్రాయపడుతున్నారు నెటిజన్లు. మహిళలు స్లిప్ అయిపోయి డేంజర్ లో పడకుండా ఉండేందుకు ఇప్పుడే మేల్కొనాలని సూచిస్తున్నారు. లింగ బేధంతో నిండిపోయిన ఈ అన్యాయమైన ప్రపంచంలోకి పిల్లలను కని తీసుకురావడం ఆపాలని అంటున్నారు. పురుషుల ఈగోలకు ప్రయారిటీ ఇవ్వకుండా పూర్తిగా అవాయిడ్ చేయాలని సూచిస్తున్నారు. సౌత్ కొరియాలో ఎప్పుడు అమ్మాయిలు కాళ్లు మూసుకుని కూర్చోండి అని చెప్తుంటారు. వేశ్యలా ప్రవర్తించకూడదు అని తిడుతుంటారు. కానీ ఈ 4B లో పార్టిసిపేట్ చేయాలనే నిర్ణయం తీసుకున్నాక పురుషులు చేతులు ముడుచుకొని కూర్చోవాల్సి వస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ ఉద్యమం అన్నింటికీ ఉమెన్ ను బ్లేమ్ చేయకుండా ఉండేందుకు జరుగుతుందని.. పురుషులపై ఎటాక్ మాత్రం కాదని అర్థం చేసుకోవాలని కోరుతున్నారు ఫెమినిస్టులు.

Advertisement

Next Story

Most Viewed