Snore Problem : ఈ సింపుల్ టిప్స్‌తో గురక నుంచి ఉపశమనం..! ముందుగా ఏం చేయాలంటే..

by Javid Pasha |   ( Updated:2024-10-16 06:49:09.0  )
Snore Problem : ఈ సింపుల్ టిప్స్‌తో గురక నుంచి ఉపశమనం..! ముందుగా ఏం చేయాలంటే..
X

దిశ, ఫీచర్స్ : ఒత్తిడితో కూడిన జీవన విధానం, ఆహారపు అలవాట్లలో మార్పులు, నిద్రలేమి, ఫ్యామిలీ హిస్టరీ.. ఇలా కారణాలేమైనా ఇటీవల అనేకమంది గురక సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే ఇది కేవలం బాధిత వ్యక్తిని మాత్రమే కాకుండా ఆ కుటుంబంలోని ఇతరులకూ సమస్యగా మారుతుంది. రాత్రిళ్లు పడుకునే సమయంలో గురక శబ్దం వల్ల నిద్రపట్టక ఫ్యామిలీ మెంబర్స్ కూడా అవస్థలు పడుతుంటారు. అంతేకాకుండా గురకను నిర్లక్ష్యం చేస్తే పలు ఇతర అనారోగ్యాలకు దారితీయవచ్చు. కాబట్టి ప్రారంభంలోనే తగిన చికిత్స తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కాగా బాధిత వ్యక్తులు గురక నుంచి ఉపశమనం పొందడానికి కొన్ని హోమ్ రెమిడీస్ అద్భుతంగా పనిచేస్తాయంటున్నారు ఆయుర్వేదిక్ నిపుణులు. అవేంటో చూద్దాం.

* పుదీనా నీరు : మీరు గురకతో ఇబ్బంది పడుతున్నట్లయితే రాత్రిపూట పుదీనా నీరు తీసుకోవడం వల్ల తక్షణ ఉపశమనం కలిగించగలదని ఆయుర్వేదిక్ నిపుణులు చెప్తున్నారు. అందుకోసం ముందుగా కొన్ని పుదీనా ఆకులను ఒక గ్లాస్ నీటిలో మరిగించి, చల్లారిన తర్వాత వాటిని తాగాలి. రోజూ రాత్రిపూట నిద్రకు ముందు ఇలా చేస్తే గురక శబ్దం తగ్గుతుంది.

* దాల్చిన చెక్క : దాల్చిన చెక్కలో గురకను తగ్గించే ఔషధ గుణాలు ఉంటాయి. కాబట్టి రాత్రిళ్లు పడుకోవడానికి ముందు ఒక గ్లాసు గోరు వెచ్చని నీటిలో దాల్చిన చెక్క పొడిన కలిపి తాగాలి. ప్రశాంతంగా నిద్రపట్టడమే కాకుండా గురక శబ్దం తగ్గే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.

* వెల్లుల్లి : గురక శబ్దాన్ని తగ్గించడంలో వెల్లుల్లి కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఒక రెబ్బను తీసుకొని గోరు వెచ్చని నీటిలో వేసుకొని కాసేపటి తర్వాత ఆ నాటిని తాగాలి. అయితే వెల్లుల్లికి వేడి కలిగించే లక్షణం ఉంటుంది కాబట్టి వేసవి, అలాగే వేడి వాతావరణ సమయాల్లో ఈ ప్రయత్నం చేయకపోవడం బెటర్.

* గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. ఆరోగ్యపరమైన నిర్ణయాలు తీసుకునే ముందు వైద్య నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed