snake bite: పాము కాటు వేయగానే మనిషి ఎంత సేపటిలో చనిపోతాడు.. ఏ పాము విషం ప్రమాదకరం?

by Javid Pasha |
snake bite: పాము కాటు వేయగానే మనిషి ఎంత సేపటిలో చనిపోతాడు.. ఏ పాము విషం ప్రమాదకరం?
X

దిశ, ఫీచర్స్ : గ్రామాలు, అటవీ ప్రాంతాల్లో వర్షాకాలం ప్రారంభంలో పాముల బెడద సహజంగానే పెరుగుతుంది. మిగతా సీజన్లతో పోలిస్తే జూన్, జులై నెలల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇందుకు కారణం.. పాములు వేసవిలో నిద్రావస్థలో ఉంటాయి. ఆ సమయంలో ప్రత్యుత్పత్తి కార్యక్రమాల్లో ఎక్కువగా నిమగ్నం అవుతాయి. తొలకరి ప్రారంభంలో సంతానాన్ని కంటాయి. అందుకే జూన్, జులై నెలల్లో పాములు, వాటి పిల్లలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా వ్యవసాయ పొలాలల్లో తిరుగాడుతుంటాయి కాబట్టి, రైతులు పాము కాటుకు గురయ్యే సందర్భాలు కూడా ఈ సీజన్‌లోనే ఎక్కువ. మన దేశంలో ప్రతీ ఏటా ఎంతో మంది పాము కాటుకు గురై చనిపోతున్నారు.

కంగారు వద్దు !

పాము కాటు నుంచి తమను తాము రక్షించుకోవాలంటే వాటి గురించి కనీస అవగాహ చాలా ముఖ్యం అంటున్నారు నిపుణులు. ఎందుకంటే వీటిలో కొన్ని ఎక్కువ విషపూరితమైనవి, మరి కొన్ని తక్కువ విషపూరితమైనవి ఉంటాయి. ఈ విషయం తెలియకపోతే విషపూరితం కాని పాము కాటు వేసినప్పటికీ కంగారులో టెన్షన్ పెరిగిపోయి ప్రాణహాని త్వరగా సంభవించే అవకాశం ఉంటుంది. మన దేశంలో పాము కాటుకు గురై ప్రతి ఏటా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే పాముకాటు మరణాలు ఎక్కువగా గ్రామాలు, అటవీ ప్రాంతాల్లోనే చోటు చేసుకుంటున్నాయి.

పాము కాటు వేయగానే..

పాము కరువగానే బాధితుడి శరీరంపై తేలికపాటి నుంచి తీవ్రమైన ప్రభావాలు కనిపిస్తుంటాయి. విషపూరితమైన పాము కాటు వేస్తే గనుక కొన్ని నిమిషాల్లోనే పాయిజన్ శరీరానికి పాకుతుంది. తక్కువ విషపూరితం అయిన పాములు కాటు వేస్తే గంటల వ్యవధిలో విషం బాడీలోకి పాకుతుంది. ఏ పాము కాటు వేసినా సమయానికి ట్రీట్మెంట్ అందకపోతే ప్రాణాలు పోవచ్చు. కాబట్టి బాధితులను వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య చికిత్స ప్రారంభించాలి.

ఏ పాము విషం ఎక్కువ ప్రమాదం?

అన్ని పాములు ప్రమాదకరం కాకపోయినా ఎల్లప్పుడూ అలర్టుగా ఉండాలి. ఎందుకంటే ఏ పాము కాటువేసిందో సహజంగానే బాధితులు గుర్తించని పరిస్థితిలో ఉంటారు. ఇక ప్రపంచంలోనే అత్యంత విష పూరితమైన పాముల్లో కింగ్ కోబ్రా ఒకటి. ఇది ఒక్క కాటుతోనే బాధితుడి శరీరంలోకి 200 నుంచి 500 మిల్లీ గ్రాముల విషాన్ని విడుదల చేస్తుంది. అయితే ఈ సందర్భంలో శరీరంలోకి పాకిన విషం, పేరుకుపోయి పరిమాణాన్ని బట్టి బాధితులు నిమిషాల్లో లేదా గంటల్లో చనిపోవచ్చు. కొన్నిసార్లు నాగుపాము కాటుకు గురైన వ్యక్తి అతనిలోని ఇమ్యూనిటీ పవర్‌ను బట్టి 2 నుంచి 5 గంటలలోపు చనిపోయే చాన్స్ ఉంటుంది.

పాము కాటు తర్వాత కనిపించే లక్షణాలు

కింగ్ కోబ్రా కాటు వేయగానే విషం శరీరానికి పాకుతూ ఉంటుంది. ఈ క్రమంలో బాధితుడి కంటిచూపు తగ్గుతుంది. కొందరిలో వెంటనే పక్షవాతం రావచ్చు. చివరికి వ్యక్తి మూర్ఛపోతాడు. ఇతర పాములతో పోల్చితే కింగ్ కోబ్రా ఎక్కువ విషపూరితమైంది. దీని విషంలో పదో వంతు కూడా బాధితులకు ప్రాణాంతకం. పాము విషం అనేక ఎంజైమ్‌లు, ప్రోటీన్లతో రూపొందుతుంది. ఇది నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. వెంటనే హృదయ స్పందనను ఆపడంవల్ల ప్రాణాలు కోల్పోయేందుకు కారణం అవుతుంది. ఇక మనిషి లేదా జంతువులపై అత్యంత వేగంగా ప్రభావం చూపే విష సర్పాల్లో కింగ్ కోబ్రా తర్వాత ఇన్‌ల్యాండ్ తైపాన్ పాము ఉంది. ఇది కాటు వేస్తే బాధితుడు 20 నిమిషాల్లోనే చనిపోవచ్చు.

* నోట్ : పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. కచ్చితమైన నిర్ధారణల విషయంలో ‘దిశ’ ఎటువంటి బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed